సర్వేలు గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
TeluguStop.com
యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం( Narayanapoor ) మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాలను యాదాద్రి జిల్లా కలెక్టర్ హానుమంత్ కే.
జెండగే( Hanumant K Zendage ) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థుల, సిబ్బందికి సంబంధించిన హాజరు రిజిస్టర్లను పరిశీలించి,నూతనంగా పూర్తయిన అదనపు గదులను సందర్శించి అనంతరం విద్యార్థులచే సరదాగా కాసేపు గడిపి, కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడ్డ పిల్లలకు ప్రత్యేక తరగతులు తీసుకోవాలని, అలాగే ఇంగ్లీష్ మీడియంపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
పిల్లల ఆరోగ్యం,ఎదుగుదలపై దృష్టి పెట్టాలని,ప్రతినెలా ఎత్తు బరువులను పర్యవేక్షిస్తూ సరైన ఆహారాన్ని పిల్లలకు అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కృష్ణ,ఎంపీడీవో ప్రమోద్ కుమార్,ఎంపీఓ జనార్దన్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్,కట్ట పాండు తదితరులు పాల్గొన్నారు.
గుర్తు పట్టనంతగా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్.. ఇలా మారిపోయిందేంటీ?