సర్వేల మతలబ్.. ఊహించడం కష్టమే !
TeluguStop.com
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.ఈ ఏడాది చివర్లో తెలంగాణలో ఎన్నికలు జరగనుండగా ఆంధ్రలో వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రెల్ లో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ఏ పార్టీ సత్తా చాటబోతుంది.ఏ పార్టీకి ప్రజలు షాక్ ఇవ్వబోతున్నారు.
అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది.ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పలు సర్వే సంస్థలు ప్రజానాడీని అంచనా వేసే ప్రయత్నం చేశాయి.
అయితే ఆయా సర్వే ఫలితాలు కూడా ఏ పార్టీకి స్పస్తమైన అధికారాన్ని కట్టబెట్టడం లేదు.
దీంతో ఈసారి గెలుపును అంచనా వేయడం కష్టమే అని విశ్లేషకులు చెబుతున్నారు. """/" /
ఈ నెల 1 న టైమ్స్ నౌ నవభారత్ సంస్థ విడుదల చేసిన సర్వే ఫలితాలలో వైసీపీ( YCP ) 24 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని, టీడీపీ ఒక్క సీటు కె పరిమితం అవుతుందని, జనసేన పార్టీ( Jana Sena ) ఆశాలు ఖాతా తెరిచే అవకాశం లేదని అంచనా వేసింది.
అటు తెలంగాణలో బిఆర్‌ఎస్ 9-11 స్థానాలు, కాంగ్రెస్ 2-3 స్థానాలు, బిజెపి 3-5 స్థానాలను సొంతం చేసుకునే అవకాశం ఆ సర్వే వెల్లడించింది.
ఇక తాజాగా 28 న ఇండియా టీవి సిఎనేక్స్ నిర్వహించిన సర్వేలో కాస్త బిన్న ఫలితాలు కనిపించాయి.
"""/" /
ఏపీలో వైసీపీ 18 సీట్లు, టీడీపీ 7 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని వెల్లడించగా, తెలంగాణలో బిజెపి 6 స్థానాలు( BJP Party ), బిఆర్‌ఎస్ 8, కాంగ్రెస్ 2 లోక్ సభ స్థానాలను సొంతం చేసుకునే అవకాశం ఉందని వెల్లడించాయి.
దీంతో సర్వేలు కూడా ప్రజానాడీని అంచనా వేయడంలో తడబడుతున్నాయా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
కాగా ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ ఈసారి ఎన్నికలు మాత్రం అన్నీ పార్టీలకు కీలకం అనే చెప్పాలి.
ప్రజలు కూడా ఈసారి పార్టీలకు మిశ్రమంగా ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.దాంతో ఏ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుందో ఊహించడం కష్టమే అని విశ్లేషకులు కూడా వారి అభిప్రాయాలను వెళ్ళబుచ్చుతున్నారు.
మరి తెలుగు రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
ఒకే ఇంట్లో నలుగురు భవిష్యత్ డాక్టర్లు.. ఈ విద్యార్థుల తండ్రి కష్టం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!