అమెరికా వద్దు...లండన్ ముద్దంటున్న భారతీయ విద్యార్ధులు...!!

భారత విద్యార్ధులు ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళ్లి చదువుకోవాలని ఎంతో ఆరాట పడుతూ ఉంటారు.

అమెరికా లాంటి అగ్ర రాజ్యంలో ఉన్న యూనివర్సిటీలలో సీటు సంపాదించడానికి పోటీ పడుతూ ఉంటారు.

ఇలా భారత్ నుంచీ విదేశాలకు వెళ్ళే విద్యార్ధులలో అత్యధిక శాతం అమెరికా వెళ్ళే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది.

కానీ ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది.అమెరికా వద్దు లండన్ ముద్దు అంటున్నారు భారతీయ విద్యార్ధులు.

తాజాగా హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ చేసిన సర్వే ప్రకారం బ్రిటన్ రాజధాని అయిన లండన్ లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో చదువుకోవడానికి భారతీయ విద్యార్ధులు ఆసక్తిని చూపిస్తున్నారని తెలిపింది.

2019 -20 కి గాను ఈ లెక్కలను విడుదల చేసింది.ఈ సమయంలో వచ్చిన భారతీయ విద్యార్ధులు 2018 -19 కంటే అత్యధికంగా నమోదయ్యారని ఈ సర్వే ప్రకటించింది ఆ ఏడాదికి భారత్ అంతర్జాతీయంగా మూడవ స్థానంలో ఉండగా తాజాగా లెక్కల ప్రకారం భారత్ రెండవ స్థానంలోకి చేరుకుందని సర్వే తేల్చి చెప్పింది.

అంతేకాదు 2019 -20 లలో 13 ,435 మంది భారత్ నుంచీ ఉన్నత చదువులకోసం రాగా 2018 -19 లలో వీరి సంఖ్య కేవలం 7,185 మాత్రమే ఉందని.

గడిచిన సంవత్సరంతో పోల్చితే అనూహ్యమైన మార్పు వచ్చిందని సంస్థ తెలిపింది.ప్రస్తుతం చైనా అత్యధిక విద్యార్ధులతో మొదటి స్థానంలో ఉండగా అమెరికా రెండవ స్థానం నుంచి మూడుకు పడిపోయింది.

ఇక రెండవ స్థానంలోకి భారత్ నిలిచింది.అయితే ఇంత పెద్ద మొత్తంలో భారత విద్యార్ధులు చేరడానికి కారణం లేకపోలేదట విద్యార్ధుల కోసం బ్రిటన్ ప్రభుత్వం రెండేళ్ళ పోస్ట్ స్టడీ వీసాను ప్రవేశపెట్టడమే అందుకు కారణమని తెలిపింది సర్వే .

అంతేకాదు అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఇమ్మిగ్రేషన్ నిభందనలు కూడా మరొక కారణమని సర్వే ప్రకటించింది.

విజయ్ దేవరకొండ టాలెంట్ ని మొదటగా నేనే గుర్తించాను, కానీ నన్ను కాదన్నారు: ప్రభాకర్