డాన్స్ తో పెళ్లి మండపంలో సందడి చేసిన పెళ్లి కూతురు... సోషల్ మీడియాలో వైరల్

భారతీయ సంప్రదాయాలలో పెళ్లి అంటే అదో అందమైన జ్ఞాపకం.జీవితంలో ఇలాంటి జ్ఞాపకం ప్రతి ఒక్కరికి ఒకసారే వస్తుంది.

అందుకే ఈ పెళ్లి వేడుకని చాలా మంది ప్రత్యేకంగా, కొత్తగా జరుపుకోవాలని అనుకుంటారు.

పెళ్లికి సంబందించిన జ్ఞాపకాలు జీవితాంతం గొప్ప అనుభూతి అందించే విధంగా మిగిలిపోవాలని అనుకుంటారు.

అల అనుకోని ఓ పెళ్లి కూతురు తన పెళ్లి వేడుకలో ఓ వినూత్న ప్రయత్నం చేసింది.

అందరిలా సిగ్గు పడుతూ కాకుండా పెళ్లి మండపంలోకి యా అమ్మాయి సంప్రదాయ దుస్తుల్లో హుషారుగా డాన్స్ చేసుకుంటూ వచ్చింది.

దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కేరళలోని కన్నూర్‌లో ఓ వివాహ వేడుకలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది.

అంజలి అనే వధువు వినూత్న ఎంట్రీతో వివాహ వేదికపై తనకు కాబోయే భర్తను ఆశ్చర్యపరచాలనుకుంది.

కొంతమంది పిల్లలతో మలైయూరు అనే మలయాళ ఫేమస్‌ పాటకు డాన్స్‌ చేసుకుంటూ మండపంలోకి వచ్చింది.

దీంతో వివాహానికి వచ్చిన అతిథులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోవడంతో పాటు ఆమె డాన్స్ కి ఆకర్షితులయ్యారు.

ఇక పెళ్లి కూతురు అలా డాన్స్ చేసుకుంటూ మండపంలోకి వస్తే పెళ్లి కొడుకు కూడా నవ్వుతూ ఆమె డాన్స్ ని ఆశ్వాదించాడు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఎవరో షేర్ చేయగా క్షణాల్లోనే లక్షల మంది చూసేసారు.

వైరల్ వీడియో: మొబైల్ షాపులో చితకొట్టుకున్న యువకులు.. చివరకు..