డాక్టర్లపై గౌరవం పెరిగింది అంటున్న సీనియర్ హీరోయిన్
TeluguStop.com
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ కరోనా బారిన పడి హాస్పిటల్స్ కి వచ్చే రోగుల కోసం డాక్టర్లు ప్రాణాలకి తెగించి ట్రీట్మెంట్ చేస్తున్నారు.
నిజంగా వారు ఎదురుగా ఉన్న మరణంతో ధైర్యంగా పోరాటం చేస్తున్నారు.డాక్టర్లు అనేవారు లేకపోతే ఇండియాలో ఇప్పటికే కరోనా కారణంగా శవాలు గుట్టలుగా తేలేవి.
ఎక్కడికక్కడ అవిశ్రాంతంగా వీరు కరోనా రోగులకి సేవలు అందించడంతో పాటు, ప్రజలు కూడా కరోనా బారిన పడకుండా వాళ్ళకి జాగ్రత్తలు చెబుతూ, కరోనా విస్తరించకుండా నిరంతరం పరీక్షలు చేస్తూ రక్షణ కల్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే సెలబ్రెటీలు మరల సినిమా షూటింగ్ లకి రెడీ అవుతున్నారు.ఈ నేపధ్యంలో వారు ఇతర ప్రాంతాలకి ప్రయాణం అవుతున్నారు.
తాజాగా వెటరన్ హీరోయిన్ మీనా కూడా షూటింగ్ కోసం చెన్నై నుంచి కేరళ వెళ్ళింది.
ఈ నేపధ్యంలో తన ప్రయాణం అనుభవాలు సోషల్ మీడియాలో పంచుకుంది.పీపీఈ కిట్ ధరించి ఉన్న ఫొటోల్ని షేర్ చేస్తూ అంతరిక్షంలోకి వెళ్లడానికి రెడీగా ఉన్నాను కదా, నాకు యుద్ధానికి వెళ్తున్నట్లు అనిపిస్తోంది.
ఏడు నెలల తర్వాత జర్నీ చేశా.ఎయిర్ పోర్ట్ వెలవెలబోయి చూట్టూ అంతా నిశ్శబ్దంగా ఉండటం చూసి సర్‌ప్రైజ్ అయ్యా అంటూ మీనా ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
అయితే కొంత మంది పీపీఈ కిట్ ధరించకుండానే వచ్చారని, వారిని చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు.
ఈ డ్రెస్ అసౌకర్యంగా ఉందని, చాలా చికాకుగా అనిపించిందిని వివరించారు.చేతికి గ్లౌజులు ధరించడం వల్ల కనీసం ముఖంపై చెమటను శుభ్రం చేసుకోలేని పరిస్థితి ఉందని తెలిపారు.
రోజంతా ఇలాంటి సూట్‌లో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లకు హ్యాట్సాఫ్.మానవత్వంతో మీరు చేస్తున్న సేవలకు ధన్యవాదాలు అంటూ ఆమె పోస్ట్ చేశారు.
మీనా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బృందావనం సినిమాలో శ్రీహరి పాత్ర కోసం మొదట ఆ స్టార్ హీరోను తీసుకోవాలనుకున్నారా .?