ఆర్ఆర్ఆర్ లో బ్రిడ్జ్ యాక్షన్ సీన్ వీడియో చూశారా.. వీఎఫ్ఎక్స్ చూస్తే వావ్ అనాల్సిందే!
TeluguStop.com
టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.
బాహుబలి సినిమా తర్వాత యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలను తన వైపు తిప్పుకునేలా చేశారు దర్శకుడు రాజమౌళి.
దీంతో రాజమౌళి తదుపరి చిత్రంపై అంచనాలుమరింత పెరిగాయి.అనేక సమస్యలను అధిగమించి భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇకపోతే ఈ సినిమాలో గోండు వీరుడు కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన విషయం తెలిసిందే.
పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 1200 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది.
ఇక దర్శక ధీరుడు రాజమౌళి తనకే క్రియేటివిటీకి తగ్గట్టుగా హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే.
ఎక్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు.సినిమాలో సన్నివేశాలను ప్రేక్షకులు మెచ్చేలా ఉండటానికి వాటిని నిజంగా ఉండేలా చేయటంలో వి.
ఎఫ్.ఎక్స్ ఎలాంటి పాత్రను పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
"""/"/
ఆర్ఆర్ఆర్ సినిమాలో అలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయి.వాటిలో ఒకటి బ్రిడ్జ్‌పై చిత్రీకరించిన యాక్షన్ సీన్.
బ్రిడ్జ్ కింద ఉన్న నదిలోకి చేపలు పట్టడానికి ఓ చిన్న పిల్లాడు వెళ్లగా, బ్రిడ్జ్‌పై వెళుతున్న ట్రెయిన్‌లో ఆయిల్ లీక్ కావటంతో పెద్ద ప్రమాదం జరిగి.
ఆ ట్రైన్ నీళ్లలో పడబోతుంది.కానీ మంటల మధ్య చిన్న పిల్లాడు చిక్కుకుంటాడు.
దాంతో ఆ పిల్లాడిని కాపాడటానికి రామ్, భీమ్ చేసే సాహసాన్ని అందరూ వెండితెరపై చూసే ఉంటారు.
మరి ఆ సన్నివేశంలో జక్కన్న వి.ఎఫ్.
ఎక్స్‌ను ఎలా ఉపయోగించారో తెలియజేస్తూ ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఓ వీడియో రిలీజ్ చేసింది.
అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
50 డేస్ సెంటర్ల విషయంలో పుష్ప ది రూల్ గ్రేట్ రికార్డ్.. అన్ని స్క్రీన్స్ లో రన్ అవుతోందా?