సూర్య బాలీవుడ్ డెబ్యూ కన్ఫర్మ్ అయినట్టే.. డైరెక్టర్ ఎవరంటే?
TeluguStop.com
కోలీవుడ్ హీరోల్లో అద్బుతమైన ఫాలోయింగ్ కలిగి ఉన్న సెన్సేషనల్ హీరోల్లో సూర్య( Hero Suriya ) ఒకరు.
ఈ మధ్య కాలంలో సూర్య నటిస్తున్న అన్ని సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలు సాధిస్తున్నాయి.
దీంతో ఈయన సినిమాలపై మరింత హైప్ ఏర్పడుతుంది.అంతేకాదు ఈయన క్రేజ్ ప్రపంచ స్థాయికి చేరుకుంది.
ప్రస్తుతం సూర్య డైరెక్టర్ శివ దర్శకత్వంలో ''కంగువ''( Kanguva ) సినిమాను చేస్తున్నాడు.
"""/"/
పీరియాడికల్ యాక్షన్ డ్రామా( Periodical Action Drama )గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అందరిని ఎంతో ఆకట్టుకుంది.యూవీ క్రియేషన్స్ అండ్ గ్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 10 భాషల్లో రిలీజ్ కానున్నట్టు టాక్.
ఇదిలా ఉండగా ప్రజెంట్ సూర్య గురించి ఒక వార్త బాలీవుడ్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
అది ఏంటంటే సూర్య బాలీవుడ్ డెబ్యూ గురించి పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు వెలువడుతున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సూర్య బాలీవుడ్ డెబ్యూ కన్ఫర్మ్ అయినట్టే అని ఈయన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా( Director Rakesh Omprakash Mehra )తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్.
"""/"/
ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట.తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన పిక్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కాంబో ఆల్మోస్ట్ సెట్ అయినట్టే అనే టాక్ బలంగా వినిపిస్తుంది.
ఈ సినిమా కర్ణ( Karna ) అనే టైటిల్ తో తెరకెక్కనుండగా ఈ మూవీ కూడా పీరియాడిక్ జోనర్ లోనే భారీ బడ్జెట్ తో డైరెక్టర్ రాకేష్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
మొత్తానికి సూర్య బాలీవుడ్ డెబ్యూ కన్ఫర్మ్ అయినట్టే.
అందంగా ఉండడం ఆ అమ్మాయికి ఇబ్బందిగా మారిందా? వీడియో వైరల్