బాలయ్య అన్ స్టాపబుల్ అంతే… బాలయ్య పై సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
TeluguStop.com
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య( Suriya ) త్వరలోనే కంగువ సినిమా( Kanguva Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
శివ డైరెక్షన్లో సూర్య నటించిన ఈ చిత్రం భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఈ సినిమా నవంబర్ 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సూర్య బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్( Unstoppable Show ) కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయిందని తెలుస్తుంది. """/" /
ఇలా అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొన్న సూర్య అనంతరం ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన బాలకృష్ణ( Balakrishna ) గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
బాలకృష్ణ గారు అన్ స్టాపబుల్ అంతే అంటూ కామెంట్స్ చేశారు.కంగువ గురించి చాలా విషయాలు మాట్లాడాము.
గతంలో పలుమార్లు సినీ వేడుకల్లో కలుసుకున్నాము కానీ ఎప్పుడు ఎక్కువసేపు మాట్లాడలేదు.మొదటిసారి ఆయనతో కలిసి చాలా సేపు మాట్లాడానని తెలిపారు.
"""/" /
బాలకృష్ణ గారి సమయపాలన చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయాను.ప్రతిరోజు 3.
30 గంటలకే నిద్ర లేచే ఆయనలో అసలు అలసట కనిపించదు అంటూ బాలయ్యని పొగిడేశారు.
ఇలా బాలకృష్ణ గురించి సూర్య పొగడ్తల వర్షం కురిపించడంతో నందమూరి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక అన్ స్టాపబుల్ కార్యక్రమం సీజన్ ఫోర్ నేటి నుంచి ప్రసారం కానుంది.
మొదటి ఎపిసోడ్ గెస్ట్ గా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
హిట్3 సినిమాతో నాని ఆ రికార్డును క్రియేట్ చేస్తారా.. ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా?