మహేష్ బాబు, సూర్య క్లాస్ మేట్స్ అని మీకు తెలుసా.. ఈ హీరోలు చిన్నప్పుడు అలా ఉండేవార?
TeluguStop.com
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న చాలామంది స్టార్ సెలబ్రెటీలు ఒకానొక సమయంలో ఒకే స్కూల్లో చదువుకున్న క్లాస్మేట్స్ అన్న విషయం మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్న పలువురు సెలబ్రిటీలు ఇప్పుడు హీరో హీరోయిన్లుగా నటీనటులుగా రాణిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఒకే స్కూల్లో చదువుకున్నారట.
ఈ విషయం చాలామందికి తెలియదు.ఇంతకీ ఆ హీరోలు ఎవరు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.
ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) అలాగే తమిళ సూపర్ స్టార్ సూర్య.
( Surya ) """/" /
వీరిద్దరికి ఈ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
చాలా వరకు ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద విడుదల కావు.
ఒకవేళ విడుదల అయితే మాత్రం ఆ హంగామా వేరే లెవల్ అని చెప్పవచ్చు.
అంతటి స్థాయిలో అభిమాన ఘనం ఉంది.కదా సూర్య అలాగే మహేష్ బాబు ఇద్దరూ ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారట.
ఇదే విషయం గురించి హీరో సూర్య మాట్లాడుతూ.చెన్నైలోని సెయింట్ బీడ్ స్కూల్ వైపు వెళ్తే చిన్ననాటి విషయాలెన్నో గుర్తుకొస్తాయి.
ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నాను.హీరో మహేష్ బాబు నా క్లాస్ మేట్.
( Classmate ) అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా( Yuvan Shankar Raja ) కూడా నా క్లాస్ మేట్ నే.
మేము ముగ్గురు కలిసి భోజనం చేసే వాళ్ళం. """/" /
అదే విధంగా ఇంట్లో చేసిన వంటకాల్ని ఒకరి కోసం ఒకరం తీసుకెళ్లే వాళ్ళం.
ఆ స్థాయిలో ఫ్రెండ్స్ షిప్ మాది.మా ముగ్గురి మధ్య ఎన్నో చర్చలు జరిగేవి.
ప్రతి సారి కుటుంబ విషయాలు గురించి మాట్లాడుకునే వాళ్ళం.కానీ ఏ రోజు కూడా సినిమా విషయాల గురించి డిస్కస్ చేసే వాళ్ళం కాదు.
కానీ చదువు పూర్తి అయ్యాక యువన్ నేను ఒకేసారి సినిమాల్లోకి వచ్చి ఒక పది సినిమాల దాకా కలిసి వర్క్ చేసాము.
కానీ మహేష్ తో పని చేసే అవకాశం మాత్రం రాలేదని తెలిపారు హీరో సూర్య.
ఇకపోతే హీరో సూర్య చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది అభిమానులు నిజమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ పెర్ఫార్మర్.. ఐశ్వర్య రాజేష్ క్రేజీ కామెంట్స్ వైరల్!