బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనున్న ఉపరితల ఆవర్తనం.. ఏపీలో వర్షాలు

బంగాళాఖాతంలో తూర్పు భూమధ్య రేఖా ప్రాంతానికి ఆనుకొని కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారనుంది.

అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా అల్పపీడనం మూడు రోజులపాటు నెమ్మదిగా కదులుతుందని ఐఎండీ అంచనా వేస్తుంది.

అల్పపీడన ప్రభావంతో ఈనెల 29, 30 వ తేదీల్లో ఏపీలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.

ఈ క్రమంలో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.

కాగా ఏపీలో చలి తీవ్రత కొనసాగుతోంది.

ఏపీ సీఎం జగన్ పై దాడి నిందితుడికి 14 రోజుల రిమాండ్..!!