బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో వానలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.దీని ప్రభావంతో దేశ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ క్రమంలో రానున్న వారం రోజుల పాటు వానలు పడనున్నాయని తెలుస్తోంది.ఇందులో భాగంగానే ఈనెల 15వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

అటు ఏపీలోని కోనసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఉపరితల ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాలే కాకుండా విదర్భ, కర్ణాటక, తమిళనాడు , జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు గుజరాత్ లలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.