సురేష్ ప్రొడక్షన్ మూవీలను రిలీజ్‌కి ఒక రోజు ముందే థియేటర్లలో వేస్తారట..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాపు ప్రొడక్షన్ హౌసెస్ లో "సురేష్ ప్రొడక్షన్స్( Suresh Productions)" నిర్మాణ సంస్థ మొదటి వరుసలో నిలుస్తుంది.

రొమాంటిక్, కామెడీ, యాక్షన్ ఇలా ఎన్నో రకాల సినిమాలు నిర్మించి విడుదల చేస్తూ బాగా పేరొందింది ఈ సంస్థ.

దీన్ని విక్టరీ వెంకటేష్ తండ్రి దగ్గుబాటి రామానాయుడు 1964లో స్థాపించారు.50 ఏళ్లకు పైగా తెలుగు సినిమా రంగంలో సురేష్ ప్రొడక్షన్స్ ఎంతో మంచి పేరు సంపాదించుకుంది.

ఈ సంస్థ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌( Rama Naidu Studios )లో ఉంది.

ఈ స్టూడియోస్‌లోనే చాలా సినిమాలు తీస్తారు. """/" / రామానాయుడు( Ramanaidu) తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ లో ఆయన కుమారుడు సురేష్ సినిమాలు చేస్తూ సంచలన హిట్స్ తీశారు.

సురేష్ బాబు తీసిన చాలా సినిమాలు దాదాపు సూపర్ హిట్ అయ్యాయి.ఇవన్నీ ఇలా విజయం సాధించడానికి వెనుక చాలా సీక్రెట్స్ ఉన్నాయి.

అలాంటి వాటిలో ఒక పెద్ద సీక్రెట్ ను బయట పెట్టారు ఓ మూవీ ఎడిటర్.

మోస్ట్ వాంటెడ్ ఎడిటర్‌గా పేరు తెచ్చుకున్న మార్తాండ్ కే వెంకటేష్ సురేష్ బాబు ఎలాంటి స్ట్రాటజీలు ఫాలో అవుతారో తెలిపారు.

"""/" / ఆయన మాట్లాడుతూ "సురేష్ బాబు సినిమా రిలీజ్‌కి ముందు ఏదో ఒక పల్లెటూరులో బాగా పాపులర్ అయిన థియేటర్ ను ఎంచుకుంటారు.

ఆ పల్లెటూరులోనే ఆ సినిమాని రిలీజ్ కి ముందు ఒక షో వేస్తారు.

సరిగ్గా 11 గంటలకి ఈ మూవీ ప్రదర్శించడం జరుగుతుంది.కానీ ప్రేక్షకులకు మాత్రం అందులో ఆల్రెడీ ఆడుతున్న సినిమాను తీసి కొత్త సినిమా వేస్తున్నట్లు చెప్పరు.

అక్కడికి మా మేనేజర్లు, మా అసిస్టెంట్స్ అందరూ వెళ్తారు.ప్రేక్షకులు సినిమా బాగుందా లేదా అని రెండే మాటలు చెబుతారు.

ఫస్టాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది అని రివ్యూలు చెప్పరు.మా అసిస్టెంట్లందరూ ప్రేక్షకులు సినిమాని ఆసక్తిగా చూస్తున్నారా, ఎంజాయ్ చేస్తున్నారా అనేది గమనిస్తారు.

""మధ్యలో లేచి వెళ్లిపోయారా లేదంటే సినిమా చివరిదాకా చూసి బాగుందని చెప్పారా అనే ఫీడ్ బ్యాక్ కూడా గ్రహిస్తారు.

ఎవరైనా మధ్యలో లేచి వెళ్ళిపోతే సినిమా బాగాలేదు అని అర్థం చేసుకొని వెంటనే సురేష్ బాబు కి ఫోన్ చేస్తారు.

ఆయన మా దగ్గరికి వచ్చి బాగాలేని సన్నివేశాలను తీసేస్తారు.బ్యాడ్ గా అనిపించినవన్నీ మళ్ళీ రిలీజ్ రోజున కనిపించకుండా ఉండాలని వాటిని మా చేత డిలీట్ చేపిస్తారు.

జంప్ వచ్చినా పర్లేదు అలాగే చేయండి అని కోరుతారు." అని చెప్పుకొచ్చారు.

రిలీజ్ కి ముందు రోజే సినిమాని ఒక షో వేసిన సందర్భాలు చాలా ఉన్నాయని కూడా ఆయన అన్నారు.

"కలిసుందాం రా, ప్రేమించుకుందాం రా, జయం మనదేరా, గణేష్," ఇలా చెప్పుకుంటే పోతే చాలా సినిమాలను విడుదలకు ముందు రోజే రిలీజ్ చేసే తర్వాత అందులో ఎడిటింగ్ చేశారు అని మార్తాండ్‌ కే వెంకటేష్ తెలిపారు.