నదియాతో ప్రేమాయణం గురించి బయటపెట్టిన సీనియర్ నటుడు సురేష్.. ఏం జరిగిందంటే?
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటుడు హీరో సురేష్(Hero Suresh) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
1980 లలో తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.
తమిళంలో పన్నీర్ పుష్పాంగళ్(Paneer Pushpangal) తో పాటు గంగై అమరన్ దర్శకత్వం వహించిన కోజి కూవుదు సినిమా తమిలంలో సురేష్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఆ కాలంలో చాక్లెట్ బాయ్ గా పేరు తెచ్చుకున్న సురేష్, నదియా, రేవతి (Suresh, Nadiya, Revathi)వంటి హీరోయిన్లతో ఎక్కువ సినిమాలు చేశారు.
దీంతో ఆ సమయంలో హీరోయిన్లతో ఆయన ప్రేమాయణం నడుపుతున్నారంటూ వార్తలు కూడా వినిపించాయి.
"""/" /
మరీ ముఖ్యంగా హీరోయిన్ నదియాని సురేష్ (Nadhiya Suresh)ప్రేమిస్తున్నట్లు గాసిప్స్ వ్యాపించాయి.
అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేష్ తన గురించి వచ్చిన ప్రేమ గాసిప్స్ పై స్పందించారు.
ఈ మేరకు సురేష్ మాట్లాడుతూ.నదియా నా మంచి స్నేహితురాలు.
ఆమెతోనే ఎక్కువ సినిమాలు చేశాను.మా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని గాసిప్స్ వచ్చాయి.
దానికి కారణం మేమిద్దరం ఎక్కువ సినిమాలు చేయడమే కాకుండా, ఆమె ప్రియుడి పేరు నా పేరు దాదాపు ఒకేలా ఉండటం.
నదియా ప్రియుడి పేరు శిరీష్, నా పేరు సురేష్.ఆమె షూటింగ్ లో ఉన్నప్పుడు తన ప్రియుడితో ఎక్కువగా ఫోన్లో మాట్లాడేది.
ఆ శిరీష్ నే ఆమె పెళ్లి కూడా చేసుకుంది.నాకు నదియాకి మధ్య ప్రేమకు అవకాశమే లేదు.
"""/" /
ఎందుకంటే నదియా నాకు ఉన్నది స్నేహం మాత్రమే.ఆమె సినిమాల్లో మెత్తగా ఉన్నా నాతో మాత్రం కఠినంగా మాట్లాడేది.
మంచి మనసున్న అమ్మాయి అన్నారు సురేష్.ఆమెకు జీవితంలో క్లారిటీ ఎక్కువ.
ఇన్ని సంవత్సరాలు సినిమాల్లో ఉండాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి, స్థిరపడ్డాక మళ్ళీ సినిమాల్లో నటించాలి అనే క్లియర్ ఐడియాతో ఉండేది.
మేము ఇప్పటికీ ఒక వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాం.ఇప్పటికీ మేము మంచి స్నేహితులం.
మా 80 ల వాట్సాప్ గ్రూప్ లో రజినీ సార్ కూడా ఉన్నారు అని సురేష్ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
గుండెలు గుభేల్: మహాకుంభమేళాలో 100 అడుగుల పాము ప్రత్యక్షం.. వైరల్ వీడియోలో ట్విస్ట్!