టాలీవుడ్ నంబర్ వన్ ఎవరనే ప్రశ్నకు సురేష్ బాబు జవాబిదే.. అలా చెప్పడంతో?
TeluguStop.com
టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే అభిమానుల దగ్గరే మాత్రమే కాదు,సెలబ్రిటీల దగ్గర కూడా ఈ విషయంపై సమాధానం లేదు.
అంతేకాదు ఈ ప్రశ్నకు సమాధానం కూడా ఎవరు చెప్పలేరు.ఆ రేంజ్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పోటీ ఉంది.
ఏ స్టార్ హీరోని తక్కువ అంచనా వేసి మాట్లాడటానికి లేదు.ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా బాక్సాఫీస్ వద్ద సత్తాను చాటుతో కోట్లలో కలెక్షన్స్ ను రాబడుతున్నారు.
తాజాగా ఈ సందేహాలపై నిర్మాత సురేష్ బాబు( Producer D Suresh Babu ) కాస్త క్లారిటీ ఇచ్చారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.ఎవరు పెద్ద హీరో అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు.
"""/" /
ప్రతీ ఒక్క హీరోకి భారీ ప్యాన్ ఫాలోయింగ్ ఉంది.సినిమా కలెక్షన్లు దర్శకుడిపై కూడా ఆధారపడి ఉంటాయి.
ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలు కూడా అనుకున్నట్లు వసూళ్లు సాధించవు.అందుకే కలెక్షన్లు ఆధారంగా పెద్ద హీరోలను నిర్ణయించలేం.
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి భారీ ఓపెనింగ్స్ ఉంటాయి.ప్రభాస్ కి కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ ఉంటాయి.
అల్లు అర్జున్ కూడా ఇలాగే సొంతం చేసుకోగలరు.ప్రభాస్( Prabhas ) దేశంలో నెంబవర్ వన్ హీరో అని చెప్పలేం.
బాహుబలి, కల్కి మధ్యలో అతడు నటించిన కొన్ని సినిమాలు అంచనాలు అందుకోలేదు.ఆంధ్రాలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి అత్యధిక పాలోయింగ్ ఉంది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిన్న దర్శకులతో సినిమా చేసినా మంచి ఓపెనింగ్స్ ఉంటాయి.
"""/" /
అలాగని ఏ సినిమా తీసినా ప్రేక్షకులు చూస్తారని అనుకోకూడదు.ఎందుకంటే గతంలో ఆయన తీసిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి.
జానీ అంచనాలు అందుకోలేదు.ఇదే చర్చ ఇప్పుడు కోలీవుడ్ లో నడుస్తోంది.
అజయ్, విజయ్, రజనీకాంత్ లో ఎవరు పెద్ద హీరో అంటే చెప్పలేం.ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీస్తే ఆదరిస్తారు.
తెలుగులో 100 కోట్లు సాధించే హీరోలు చాలా మంది ఉన్నారు అని చెప్పుకొచ్చారు సురేష్ బాబు.
ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.