ఈ స్టైలిష్ డైరెక్టర్ రేసులో వెనుకబడడానికి కారణం.. ఇదేనా?
TeluguStop.com
ఇండస్ట్రీలో ప్రెజెంట్ చాలా మంది డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మన తెలుగు ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా విస్తరించేలా చేస్తుంటే మరికొంత మంది డైరెక్టర్లు మాత్రం ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దానికి పైగానే అవుతున్న వాళ్లకు ఉన్న లేజీ నెస్ కారణంగా రేసులో వెనుక ఉన్నారు.
టాలెంట్ ఉన్నప్పటికీ చురుకు లేకపోవడమే వీరికి మైనస్ గా మారుతుంది అని నెటిజెన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.
మరి ముఖ్యంగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి పై ఇలాంటి వార్తలే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
2005లో ఈయన అతనొక్కడే సినిమాతో జర్నీ స్టార్ట్ చేయగా ఇప్పటి వరకు ఈయన 18 ఏళ్ల కెరీర్ లో అందుకున్న విజయాలు మాత్రం నాలుగే అని చెప్పాలి.
అతనొక్కడే, కిక్, రేసుగుర్రం, ధ్రువ వంటి సినిమాలు ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
"""/"/
మరి ఈ జర్నీలో సురేందర్ రెడ్డి నాలుగే విజయాలు సాధించడానికి ముఖ్య కారణం ఈయన లేజీ నెస్ అనే అంటున్నారు.
డైరెక్టర్లు టైం పెట్టుకుని మరీ సినిమాలు పూర్తి చేస్తుంటే సురేందర్ రెడ్డి మాత్రం అనుకున్న దాని కంటే డబల్ సమయం తీసుకుంటూ నిర్మాతలకు కూడా బడ్జెట్ పెంచేస్తున్నాడు.
"""/"/
మరి ప్రెజెంట్ స్టార్ డైరెక్టర్లు అంత ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నప్పటికీ ఈయన వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు.
ప్రెజెంట్ ఈయన చేస్తున్న ఏజెంట్ సినిమా పరిస్థితి కూడా ఇలానే మారింది.అఖిల్ అక్కినేని హీరోగా అనిల్ సుంకర భారీ స్థాయిలో నిర్మిస్తున్న సినిమాను గత రెండేళ్లుగా చిక్కుతునే ఉన్నాడు.
ఇప్పటికే అనుకున్న దాని కంటే ఎక్కువ భారం అనిల్ సుంకర మీద పడింది అని అయినా ఇంత వరకు షూట్ అయితే పూర్తి చేయలేదని.
రీ షూట్ కారణంగానే ఆలస్యం అవుతుంది అని అంటున్నారు.మరి ఈయన ముందు ముందు అయినా తన వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా నిర్మాతలు ఈయనతో సినిమా అంటే భయపడడం ఖాయం.
అమ్మో.. `టీ`తో ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా..?