ఈ ఫోటోలోని టాలీవుడ్ ప్రముఖ నటిని గుర్తు పట్టారా..?
TeluguStop.com
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో సురేఖా వాణి ఒకరు.
2005లో ఒక చిన్న సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన సురేఖా వాణి స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
సినిమాల్లో అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో ఎక్కువగా నటించే సురేఖావాణి సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ హీరోయిన్లతో సమానంగా క్రేజ్ తెచ్చుకుంటోంది.
ఈ మధ్య కాలంలో సురేఖా వాణికి అవకాశాలు కొంత తగ్గినా ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న ఆర్టిస్టులలో ఈమె ఒకరు.
40కు పైగా సినిమాల్లో నటించిన సురేఖా వాణికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫోటోలో సురేఖా వాణి ముఖానికి మేకప్ లేకుండా సోది చెప్పించుకుంటోంది.సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో సురేఖా వాణి సోషల్ మీడియాలో తన కూతురు సుప్రీతతో ఉన్న ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటోంది.
ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో సుప్రీతను హీరోయిన్ గా పరిచయం చేయాలని సురేఖా వాణి భావిస్తోందని తెలుస్తోంది.
తన కూతురుకు ఏదైనా పంచుకునే స్వేచ్చను ఇస్తానని ఆమె చెబుతోంది.పార్టీలు, పబ్బులకు వెళ్లినా కూడా కూతురు తనతో ఉండాలని ఆమె చెబుతోంది.
ఏవైనా పాటలు తనకు నచ్చితే కూతురుతో కలిసి డ్యాన్స్ చేసి ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటానని తెలిపింది.
కూతురిని సినిమాల్లో పరిచయం చేస్తానో లేదో ఖచ్చితంగా చెప్పలేనని సుప్రీత సినిమాల్లోకి వెళతానంటే మాత్రం తాను అడ్డు పడనని ఆమె పేర్కొంది.
సురేఖా వాణి కూతురు ఇండస్ట్రీలో అడుగు పెడితే మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి.
కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?