Supritha : పులి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న సుప్రీత.. నెట్టింట్లో వీడియో వైరల్?
TeluguStop.com
టాలీవుడ్ ప్రేక్షకులకు నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి ( Surekhavani )గురించి ప్రత్యేకంగా పరిచయం చెప్పాల్సిన పనిలేదు.
సురేఖ వాణి కూతురు సుప్రిత ( Supritha )కూడా మనందరికి సుపరిచితమే.సురేఖ కూతురు సుప్రితతో కలిసి చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తెలిసిందే.
కరోనా సమయంలో టిక్ టాక్ వీడియోలు తీస్తూ, డాన్సులు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
అయితే సురేఖ వాణి ఈ వయసులో కూడా కూతురితో పాటు డాన్సులు వేస్తూ అందాలను ఆరబోస్తూ ఉంటుంది.
"""/" /
ఆ వీడియోలు ఫోటోలను చూసిన నెటిజన్స్ కూతురు కంటే సురేఖ వాణి బాగుంది అంటూ కామెంట్స్ చేస్తుంటారు.
కాగా సురేఖ వాణి, సుప్రీత తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన ఫోటోలను వీడియోలను పంచుకుంటూ ఉంటారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ప్రస్తుతం థాయిలాండ్ టూర్( Thailand Tour ) లో ఉన్న సుప్రిత తన వెకేషన్ కి సంబందించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
"""/" /
అక్కడ తాను ఏక్స్ ప్లోర్ చేసిన ప్రాంతాలు, తన షాపింగ్, ఎంజాయ్ మెంట్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది.
థాయిలాండ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సుప్రిత తాను ఓ పులి పిల్లను పట్టుకుంది.
ఎంతో ధైర్యంగా దానిని పట్టుకుని ఆడించింది.అందుకు సంబంధించిన వీడియో తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది.
ఆ వీడియోపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.ఇకపోతే సురేఖ అభిమానులు సురేఖ వాణి కూతురు సుప్రిత ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఆమె నువ్వు సినిమాలోకి రమ్మంటూ సలహాలు ఇస్తున్నారు.
సియాటెల్‌లోని ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో ‘‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ’’