హీరోయిన్గా నటిస్తాను అంటే తాతయ్య వద్దన్నారు: సుప్రియ

సుప్రియ యార్లగడ్డ( Supriya Yarlagadda ).అక్కినేని ఫ్యామిలీ మెంబర్ గా అందరికి తెలుసు.

అలాగే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో( Akkada Ammayi Ikkada Abbayi ) హీరోయిన్గా నటించిన సందడి చేశారు.

ఈ సినిమా తర్వాత ఈమె అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studioes) బాధ్యతలు తీసుకోవడమే కాకుండా పలు సినిమాలను నిర్మిస్తూ బిజీగా మారిపోయారు.

తాజాగా సుప్రియ చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బాయ్స్ హాస్టల్( Boys Hostel ) అనే సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమా ఆగస్టు 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా సుప్రియ మీడియా ముందుకు వచ్చారు. """/" / ఇలా ఇంటర్వ్యూలో హాజరైనటువంటి ఈమెకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

మరి నటిగా మీరు తిరిగి తెరపై కనిపించే సందర్భాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తాను ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగాలని అనుకున్నాను ఇదే విషయం ఇంట్లో చెప్పడంతో తాతయ్య అసలు వద్దని చెప్పారు.

ఇండస్ట్రీలో హీరోయిన్ గా చేయాలి అంటే చాలా కష్టమని చెప్పారు.దాంతో నేను మరింత పట్టుబట్టి హీరోయిన్గా చేయాల్సిందేనని చెప్పాను.

"""/" / ఒకసారి హీరోయిన్గా నటిస్తేనే కదా తెలుస్తుంది అందుకే నేను సినిమాలలోకి వస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్గా నటించాను.

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నావల్ల కాలేదు అందుకే ఇకపై సినిమాలలో నటించకూడదని తానే ఇండస్ట్రీకి దూరమయ్యానని సుప్రియ వెల్లడించారు.

మరి గూడచారి2( Goodachari 2 ) సినిమా ద్వారా రీఎంట్రీ గురించి కూడా ఈమెను ప్రశ్నించడంతో అది రీఎంట్రీ కాదు.

నాకు కథ నచ్చింది చేయడానికి మంచి స్కోప్ ఉంది వాళ్ళు కూడా నన్ను అడగడంతో గూడచారి 2 లో నటించానని ఇలాంటి కథలు దొరికితే తప్పకుండా నటిస్తానని తెలిపారు.

ఈ ఇంటి చిట్కాలతో నెలసరి అవ్వదు ఇక ఆలస్యం..!