Supreme Court : సీఏఏ నిబంధనలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

సీఏఏ( CAA ) నిబంధనలపై స్టే ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో( Supreme Court ) విచారణ జరిగింది.

ఈ మేరకు సీఏఏ అమలు నిబంధనలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.ఈ క్రమంలోనే ఏప్రిల్ 2వ తేదీ నాటికి సమాధానం ఇవ్వాలని కేంద్రానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

అదేవిధంగా ఏప్రిల్ 8వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది.

బన్నీపై కేసును విత్ డ్రా చేసుకుంటాను.. రేవతి భర్త సంచలన నిర్ణయం వైరల్!