వంద శాతం వీవీప్యాట్‎ల ట్యాలీ పిటిషన్‎పై సుప్రీం తీర్పు రిజర్వ్

వంద శాతం వీవీప్యాట్‎ల( VVPATs ) ట్యాలీ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్లను వంద శాతం ట్యాలీ చేసే విధంగా ఈసీకి( EC ) ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

ఈ మేరకు పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా( Justice Sanjeev Khanna ) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

కేరళలో మాక్ పోల్ సందర్భంగా అన్ని ఓట్లూ బీజేపీకీ నమోదైన విషయాన్ని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ విషయంపై వెంటనే విచారణ జరపాలని సీఈసీకి సుప్రీంకోర్టు( Supreme Court ) కీలక ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం వంద శాతం వీవీప్యాట్‎ల ట్యాలీపై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.

అమితాబ్ పాదాలను తాకిన సచిన్ షారుఖ్.. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న వీళ్లు గ్రేట్ అంటూ?