ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీం కీలక తీర్పు

ప్రజా ప్రతినిధుల వ్యాఖ్యల పరిమితులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.వారి వ్యాఖ్యలపై పరిమితులను విధించలేమని తెలిపింది.

4:1 తేడాతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ప్రకటించింది.రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) నిర్దేశించిన ఆంక్షలు మినహా వాక్ స్వాతంత్య్రంపై ఎలాంటి ఆంక్షలు విధించలేమని ధర్మాసనం పేర్కొంది.

మంత్రుల విద్వేషపూరిత వ్యాఖ్యలను నియంత్రించాల్సిన బాధ్యత పార్టీలదేనని స్పష్టం చేసింది.అన్ని పార్టీలు ప్రవర్తన నియమావళి రూపొందించుకోవాలని సూచించింది.

విద్వేష పూరిత వ్యాఖ్యలతో పౌరులు ఇబ్బంది పడితే సివిల్ కోర్టులను ఆశ్రయించవచ్చని సుప్రీం వెల్లడించింది.

కొడుకుకు నామకరణం చేసిన బిగ్ బాస్ మానస్.. ఏం పేరు పెట్టారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!