నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
TeluguStop.com
నోట్ల రద్దుపై భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నోట్ల రద్దుకు వ్యతిరేకంగా 58 పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్లపై జస్టిస్ ఎస్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ క్రమంలో నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీం సమర్థించింది.ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 26(2) ప్రకారం భారత సెంట్రల్ బ్యాంకుకు ఈ అధికారం ఉంటుందని తెలిపింది.
ఈ మేరకు 2016 నవంబర్ 8న నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ సరైనదేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కాగా 2016లో ప్రధాని మోదీ రూ.500, రూ.
1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
కెనడా – బంగ్లాదేశ్‌లలో హిందువులపై దాడులు.. అమెరికాలో ప్రవాస భారతీయుల ర్యాలీ