మార్చి 5న అయోధ్య కేసులో తుది తీర్పు! సుప్రీం కోర్ట్ నిర్ణయం!

అయోధ్యలో రామ మందిరం నిర్మాణంకి సంబంధించి చాలా ఏళ్లుగా సుప్రీం కోర్ట్ లో కొనసాగుతున్న కేసు విచారణ ముగింపు దశకి చేరుకుంటుంది.

ఎప్పటి నుంచో విచారణ జరుగుతూ, హిందూ, ముస్లిం మతాల మధ్య ఆధిపత్య పోరుగా ఈ అయోధ్య రామమందిరం కేసు నడుస్తూ వస్తుంది.

అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని హిందూ సంఘాలు, కాదు మసీదు నిర్మించాలని ముస్లిం సంఘాలు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాయి.

చివరికి ఈ పోరాటం సుప్రీం కోర్ట్ వరకు వచ్చింది.దీంతో సుప్రీం కోర్ట్ లో ఐదు మందితో కూడిన ధర్మాసనం అయోధ్య రామమందిరం నిర్మాణం గురించి ఇన్ని రోజులు వాదోపవాదాలు విన్న తర్వాత మార్చి 5వ తేదీన తుది తీర్పు ఇవ్వాలని నిర్ణయించుకుంది.

అయితే మార్చి 5న అయోధ్య రామ మందిర నిర్మాణం గురించి సుప్రీం కోర్ట్ తీర్పు వెలువరించాలని నిర్ణయం తీసుకోవడం వెనుక అధికార పార్టీ బీజేపీ హస్తం ఉందనే అనుమానాలని కాంగ్రెస్ పార్టీతో పాటు, బీజేపీయేతర పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ఎన్నికల కోడ్ దగ్గర పడుతున్న టైంలో ఊహించని విధంగా సుప్రీం కోర్ట్ అయోధ్య కేసులో తీర్పు వెల్లడిస్తే కచ్చితంగా అది అధికార పార్టీకి ప్లస్ అవుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో మార్చి 5న సుప్రీం కోర్ట్ ఈ అయోధ్య కేసులో ఎలాంటి తీర్పు వెలువరిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వాస్తు శాస్త్రం ప్రకారం చిన్న పిల్లల.. దగ్గర ఉండకూడని వస్తువులు ఇవే..!