ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు స్టే

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు స్టే

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.50 శాతాన్ని మించి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు స్టే

దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాల్సిందిగా ఉన్నతన్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు స్టే

చాలా కాలంగా జరగకుండా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.

మార్చిలో ఎన్నికలు జరిపించాలని ప్లాన్ సిద్ధం చేసుకుంది.దీనికి సంబందించిన పంచాయితీలు, మున్సిపాలిటీల రిజర్వేషన్ లని కూడా ఖరారు చేసింది.

అయితే ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఇప్పుడు సమస్యగా మారింది.అధికార పార్టీకి అనుకూలంగా పంచాయితీల రిజర్వేషన్ అమలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పంచాయితీలలో 50 శాతం మించి రిజర్వేషన్ ఇవ్వడంపై ఇప్పుడు సుప్రీం కోర్టు తప్పు పట్టింది.

దీంతో ఎన్నికల నిర్వహణపై జారీ చేసిన జీవోపై స్టే విధించింది.ఏపీ పంచాయతీ ఎన్నికల్లో 50శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమంటూ ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతాప్ ‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

కాగా హైకోర్టు దానిపై స్పందించలేదు.దీంతో అతను సుప్రీం కోర్టుని ఆశ్రయించారు.

పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణకు రాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇచ్చిన జీవోపై స్టే విధిస్తూ.

హైకోర్టులో ఉన్న పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

జియో సైకిల్: ఒకసారి ఛార్జ్ చేసారంటే 80 కి.మీ ఏకధాటిగా చుట్టి రావచ్చు!