ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.ఎన్జీటీ విధించిన నష్టపరిహారాన్ని వెంటనే జమ చేయాలని ఆదేశించింది.

పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణం పై ఎన్జీటీ జరిమానా విధించింది.ఈ నేపథ్యంలో రూ.

250 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఎన్జీటీ ఆదేశం ఇచ్చింది.నష్టపరిహారం అంశం మినహా ఎన్జీటీ తీర్పును అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి తెలిపింది.

రూ.250 కోట్ల నష్టపరిహారం పై విచారణ కొనసాగుతుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జె కే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘించారని జాతీయ హరిత ట్రిబ్యునల్ విధించిన జరిమానాపై ఏపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

పవన్ అంటేనే ఇష్టం.. కమెడియన్ అలీ సంచలన వ్యాఖ్యలు!