సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కు బెయిల్ నిరాకరించిన ధర్మాసనం
TeluguStop.com
1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషి గా తేలిన కాంగ్రెస్ నేత,మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కు బెయిల్ పిటీషన్ ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది.
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న సజ్జన్ కుమార్ అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేయాలి అంటూ ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇదేమి చిన్న కేసు కాదు అని,ఈ కేసులో మేం ఎలాంటి బెయిల్ మంజూరు చేయలేం అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది.
అంతేకాకుండా ఆయన ఆస్పత్రిలో ఉండటానికి కూడా వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయని అందువల్ల ఆయన ఆస్పత్రిలో చేరడానికి కూడా వీల్లేదంటూ ధర్మాసనం పేర్కొంది.
1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య అనంతరం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.హత్యకు పాల్పడిన బాడీగార్డులు ఇద్దరూ సిక్కులు కావడంతో ఆ సమాజంపై కొందరు హింసకు దిగారు.
ఢిల్లీ రాజ్‌నగర్‌లోని ఓ కుటుంబంలో ఐదుగురు సభ్యులను హత్యచేశారు.గురుద్వారాకు నిప్పంటించారు.
ఆ సమయంలో సజ్జన్‌కుమార్ ఆ ప్రాంత ఎంపీగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అల్లర్ల కు సంబంధించి ఆయనను కోర్టు దోషిగా తేల్చింది.
దీనితో ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించడం తో ఆయన జైలు జీవితం గడుపుతున్నారు.
తాజాగా అనారోగ్య సమస్యల దృష్ట్యా తనకు బెయిల్ కావాలి అంటూ పిటీషన్ దాఖలు చేయగా దానిని కోర్టు తోసిపుచ్చింది.
ప్రస్తుతం న్యాయస్థానాలు భౌతికంగా పని చేయక పోతున్న నేపథ్యంలో బౌతికంగా పనిచేయడం ప్రారంభమైన తర్వాత శిక్ష, జీవితఖైదుపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది.
వైట్ హౌస్‌లో దుబాయ్ బిలియనీర్‌తో ఎలాన్ మస్క్ బ్రేక్‌ఫాస్ట్.. పక్కన భారత సంతతి పార్ట్‌నర్?