హిందుత్వ వివాదంలో ఆ వెబ్ సిరీస్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ఈ మధ్యకాలంలో హిందుత్వ మనోభావాల్ని కించపరచడం ప్రతి ఒక్కరికి ఒక అలవాటగా మారిపోయింది.

జనాలకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందించడంపై దర్శకులు దృష్టిపెట్టకుండా కథలని వివాదాల చుట్టూ, లేదంటే వివాదాస్పద అంశాల చుట్టూ తిప్పుతూ ఒక వర్గాన్ని కించపరచడం, లేదంటే ఒక భావజాలాన్ని తప్పు పట్టడం చేస్తూ వ్యక్తిగత ఎజెండాతో సినిమాలు, వెబ్ సిరీస్ లు తీస్తున్నట్లు అనిపిస్తుంది.

సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ని ఒక పరిధి వరకు ఉంటే బాగానే రిసీవ్ చేసుకుంటారు.

అయితే శృతి మించి కావాలని ఏదో ఒక అంశాన్ని, భావజాలాన్ని అదే పనిగా ఎంటర్టైన్మెంట్ ముసుగులో దూషిస్తే సహించడం కష్టం.

ఈ నేపధ్యంలో కంటెంట్ మీద హైప్ క్రియేట్ చేయడం కోసం దర్శకులు చేస్తున్న ఈ పిచ్చి పనులు వారిని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిప్పుతున్నాయి.

తాజాగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయినా హిందీ వెబ్ సిరీస్ తాండవ్ విషయంలో కూడా ఇదే జరిగింది.

తాండవ్ వెబ్ సిరీస్ లో హిందుత్వ మనోభావాలు కించపరిచే విధంగా డైలాగ్స్, సన్నివేశాలు ఎక్కువగా చిత్రీకరించారు.

అయితే దీనిపై హిందుత్వ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేసి ఆ వెబ్ సిరీస్ పై కోర్టుకి ఎక్కారు.

అయితే ఈ వివాదంపై వెబ్ సిరీస్ దర్శకుడు, సైఫ్ అలీఖాన్ సారీచెప్పిన కూడా క్షమించలేదు.

దీంతో ఆ కేసు మరింత తీవ్రంగా మారి తమని అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో త‌మ‌ను అరెస్ట్ చేయ‌కుండా ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ ఈ సిరీస్ న‌టుడు జీషాన్ ఆయుబ్‌, అమెజాన్ క్రియేటివ్ హెడ్ అప‌ర్ణ పురోహిత్‌, సిరీస్ మేక‌ర్ హిమాన్షు కిష‌న్ మెహ్రా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

దీనిపై జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్‌, జ‌స్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జ‌స్టిస్ ఎంఆర్ షాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌రిపింది.

ఈ సంద‌ర్భంగా మీ భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ హ‌క్కును మీరు దుర్వినియోగం చేయ‌కూడ‌దు.

ఓ వ‌ర్గం మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసే పాత్ర‌ను మీరు చిత్రించ‌కూడ‌దు అని కోర్టు స్ప‌ష్టం చేసింది.

ఈ నేపధ్యంలో హిందుత్వ మనోభావాలు కించపరిచారనే అభియోగాలపై వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

దళితులపై నారా భువనేశ్వరి అసభ్య పదజాలం.. ఫేక్ కాదని నిర్ధారణ..!!