స్వగ్రామం లో పర్యటించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
TeluguStop.com
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పొన్నవరంలో పర్యటించారు.
గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత మొదటిసారి ఆయన స్వగ్రామం రావడంతో గ్రామంలో ఆనంద ఉత్సాహాలు వెల్లివిరిశాయి.
దారిపొడవునా ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు.గ్రామానికి చేరుకున్న ఆయనను ఎడ్లబండిపై ఎక్కించి గ్రామం లోని శివాలయం వద్దకు తీసుకెళ్ళారు.
అక్కడ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కాసేపు ముచ్చటించారు.
మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన కొనసాగనుంది.
ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.కన్నతల్లి, ఉన్న ఊరు స్వర్గం కన్నా గొప్పవి.
ఢిల్లీకి రాజైన ఈ తల్లికి నేను బిడ్డనే.ఈ గ్రామంలో పుట్టి పెరిగి ఈ స్ధానానికి వచ్చానంటే మీ సహకారం వలనే.
చిన్నప్పుడు వీధి బడి ఉండేది.ఇప్పటిలాగా ఎయిర్ కండీషనర్ లా ఉండేవి కావు.
నా బాల్యం లో ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కోలేదు. """/" /
5 వ తరగతి వరకు పొన్నవరం లోనే చదివాను తర్వాత కంచికచర్ల లో విద్యనభ్యసించా.
రాజకీయంగా మా ఊరు చైతన్యవంతమైన ఊరు.ఎన్నికలప్పుడే పోటీ ఉండేది .
తర్వాత పోటీ చేసిన వారంతా ఐకమత్యంగా ఉండేవారు.అటువంటి వాతావరణం పొన్నవరం లో ఉండేది.
వంగవీటి రంగా మీటింగ్ కు గతంలో ఎడ్లబండి పైన వెళ్లాం.చదువుకున్న రోజుల నుంచే రాజకీయాలపై ఆసక్తి పెరిగింది.
యూఏఈలో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష అమలు .. నెల వ్యవధిలో మూడు ఘటనలు