సుప్రీంకోర్టుకు ఐఆర్ఎస్ అధికారి కె.వి. బ్రహ్మానందరెడ్డి..!

ఐఆర్ఎస్ అధికారి కె.వి.

బ్రహ్మానందరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.వాన్ పిక్ భూ కేటాయింపుల్లో ఆయన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

వాన్ పిక్ భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని సీబీఐ దాఖలు చేసిన కేసును క్వాష్ చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

ఈ నేపథ్యంలోనే జులైలో బ్రహ్మానంద రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.

తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంను బ్రహ్మానంద రెడ్డి ఆశ్రయించారు.పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉందని తెలిపింది.

ఆ తీర్పుపై జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది.

ఆగస్ట్ 15 లోపు పూర్తిగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : హరీష్ రావు