పెగాసస్ పై దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారణ..!!

పెగాసస్ వ్యవహారం జాతీయ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.దేశ భద్రత పేరిట కేంద్ర ప్రభుత్వంనిఘా వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఉగ్రవాదులు మాదకద్రవ్యాల వంటి విషయాలపై దృష్టి పెట్టకుండా, నిఘా వ్యవస్థ ద్వారా ప్రత్యర్థుల నీ టార్గెట్ చేస్తున్నట్లు ఇటీవల వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఉభయ సభలలో ప్రతిపక్షాలు ఆరోపిస్తు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నాయి.

ఇటువంటి తరుణంలో పెగాసస్ ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో 9 పిటిషన్లు దాఖలు కావడంతో తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ స్టార్ట్ చేయడం జరిగింది.

సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పిటిషనర్ల తరఫున వాదనలు వినిపిస్తున్నారు.పెగాసస్ పై సుప్రీం ఆధ్వర్యంలో దర్యాప్తు జరగాలని అని మొత్తం తొమ్మిది పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ స్పైవే ద్వారా.నేతలను జర్నలిస్టులను ప్రత్యర్థులను టార్గెట్ చేసినట్లు పిటిషనర్లు ఆరోపణలు చేయడం జరిగింది.

ఈ స్పైవే ఎవరు కొనుగోలు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెలిపారు.దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేయాలని కపిల్ సిబల్ కోర్టు ని కోరారు.

స్వతంత్ర దర్యాప్తు తో నిజాలు వెలుగులోకి తీసుకు రావాలని కోరారు.ఈ క్రమంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ పెగాసస్ పై ఆరోపణలు తీవ్రమైనవి అని అన్నారు.

ఈ అంశంపై లోతుగా విచారణ జరగాలని ఖచ్చితమైన సమాచారం జోడించాల్సి ఉంది అని అన్నారు.

నాగబాబు ట్వీట్ పై స్పందించిన శిల్పా రవి.. ఏమన్నారంటే?