అమరావతి కేసులపై సుప్రీంకోర్టులో విచారణ

అమరావతి కేసులపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.అమరావతే రాజధాని అంటూ గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది.

ఐటెమ్ నంబర్ 65 గా జస్టిస్ ఖన్నా, జస్టిస్ దత్త ధర్మాసనం ముందు కేసు లిస్ట్ అయింది.

ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని వ్యవహారంలో సుప్రీం ఏం తీర్పు ఇవ్వనుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

వీడియో: పట్టపగలే దారుణం.. నర్సింగ్ విద్యార్థిని గొంతు నులిమి చంపబోయిన ప్రేమోన్మాది..