అమరావతి రాజధాని అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
TeluguStop.com
అమరావతి రాజధాని అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.రాజధాని వ్యవహారంపై దాఖలైన పిటిషన్ పై సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు ఇప్పటికే తెలిపింది.ఈ మేరకు హైకోర్టును తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది.
హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ప్రభుత్వం పిటిషన్ లో కోరింది.శాసన, పాలన వ్యవస్థ అధికారాల్లోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ విరుద్ధమని సర్కార్ తెలిపింది.
వికేంద్రీకరణతో అమరావతి అభివృద్ధి జరగదనడం సరికాదని పేర్కొంది.అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాళి నా మొహాన విసిరికొట్టింది.. 32 ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగా.. నటి మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు!