ఎంబీబీఎస్ కోర్సుల్లో ఎన్ఆర్ఐ విద్యార్ధుల కోటా.. అసోం ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
TeluguStop.com
అసోంలోని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వానికి సుప్రీంకోర్ట్( Supreme Court ) షాకిచ్చింది.
ఆ రాష్ట్రంలో ఎంబీబీఎస్ కోర్సుల్లో( MBBS ) ప్రవేశాలకు సంబంధించి ఎన్ఆర్ఐ కోటాను నిలిపివేసింది.
ఈ మేరకు ఎన్ఆర్ఐ కోటాను( NRI Quota ) అమలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
అసోంలో ఎంబీబీఎస్ చదవాలనుకున్న ఎన్ఆర్ఐ విద్యార్ధి సీటుకు రూ.18 లక్షల చొప్పున చెల్లించడం, మెడికల్ సీట్ల రిజర్వేషన్లపై ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయవాది ఆదిజ్ జమాన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం పై విధంగా ఆదేశాలు జారీ చేసింది.
తదుపరి విచారణ జరిగే వరకు ఎన్ఆర్ఐ కోటాను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
"""/" /
అసోం ప్రభుత్వం( Assam Govt ) ఈ ఏడాది జూన్‌లో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా వున్న వైద్య కళాశాలల్లో ఎన్ఆర్ఐ విద్యార్ధులకు( NRI Students ) ఎంబీబీఎస్ కోర్సులలో పది శాతం సీట్లను రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.చట్టపరమైన జోక్యానికి దారి తీసింది.
పలువురు మేధావులు, విద్యార్ధి సంఘాలు దీనిపై భగ్గుమన్నాయి.అయితే రాష్ట్రంలో మెడికల్ సీట్ల పెంపు కారణంగా అడ్మిషన్ నిబంధనలను సవరించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్ధించుకుంది.
"""/" /
ఈ మౌంటింగ్ కెపాసిటీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ( Himanta Biswa Sarma ) స్పందించారు.
రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం నిబంధనలకు సవరణలు చేసినట్లు వెల్లడించారు.ప్రతిపాదిత ఎన్ఆర్ఐ కోటా పథకం కింద.
15 శాతం ఆల్ ఇండియా కోటా, సెంట్రల్ పోల్, ఈశాన్య మండలి కోటాలు ముగిసిన తర్వాత మిగిలిన మొత్తం ఎంబీబీఎస్ సీట్లలో పది శాతం ఎన్ఆర్ఐ విద్యార్ధులకు కేటాయించబడతాయని సీఎం పేర్కొన్నారు.
ఎన్ఆర్ఐ కోటా ద్వారా ప్రవేశం కోరుకునే విద్యార్ధులు తప్పనిసరిగా నీట్ యూజీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని బిశ్వ శర్మ చెప్పారు.
ఇందుకు అవసరమైన విద్యార్హతలు కూడా ముఖ్యమేనన్నారు.
సీడెడ్ కింగ్ ఎన్టీఆర్ అని అందుకే కామెంట్ చేస్తారా.. ఇన్ని సినిమాలు డే1 రికార్డ్ సాధించాయా?