అమెరికా : 150 ఏళ్ళు వెనక్కి లాగేశారు... సుప్రీంకోర్టు పై బిడెన్ సంచలన వ్యాఖ్యలు...

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మరో మారు సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టారు.కొన్ని రోజుల క్రితం తుపాకి నియంత్రణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అమెరికన్స్ కు స్వీయ రక్షణ కావాలని అందుకు తుపాకులను చేతబట్టచ్చు అంటూ సంచలన తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు తాజాగా అమెరికా మహిళలు గడిచిన కొన్నేళ్లుగా పోరాడుతున్న అబార్షన్ చట్టంకు మద్దతు ఇస్తూ తీర్పు చెప్పింది.

దాంతో అమెరికా వ్యాప్తంగా మహిళలు బగ్గుమన్నారు .సుప్రీం కోర్టు తీర్పు తమ హక్కులను కాలరాస్తున్నట్టుగా ఉందని మండిపడ్డారు.

వివరాలలోకి వెళ్తే.అమెరికాలోని మహిళలు గడిచిన కాలంగా అబార్షన్ అనేది తమ హక్కని, పిల్లలని కనే అధికారం ఉన్న మాకు అబార్షన్ కూడా చేయించుకునే హక్కు ఉందని పోరాడుతున్న విషయం తెలిసిందే.

ఈ హక్కును అమెరికా రాజ్యాంగం తమకు ఇచ్చిందని కోర్టు ఈ విషయంలో ఎలాంటి వ్యతిరేక తీర్పు చెప్పద్దంటూ నిరసనలు చేపట్టారు అమెరికా మహిళలు.

కానీ ఈ హక్కును తాజాగా సుప్రీంకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టు తీర్పుపై నిరసనలు వెల్లువెత్తాయి.

తమ ప్రాధమిక హక్కును రద్దు చేయడం సరైన తీర్పు కాదంటూ మండిపడ్డాయి.ఇదే తీర్పుపై అమెరికా అధ్యక్షుడు బిడెన్ సైతం గాటుగానే స్పందించారు.

"""/"/ ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమెరికా మహిళల ప్రాధమిక హక్కును కాలరాసిందని, అమెరికాను 150 ఏళ్ళు వెనక్కు తీసుకుపోయిందని ఈ తీర్పు విచారకరమని వ్యాఖ్యానించారు.

అబార్షన్ కు చట్టబద్దత తొలగించడం అమెరికా మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారి జీవితాలు ప్రమాదంలో పడతాయని అన్నారు.

అంతేకాదు మహిళల రక్షణకు గాను తనకు ఉన్న ప్రత్యేకమైన అధికారాలను ఉపయోగించైనా సరే భవిష్యత్తులో వారికి న్యాయం చేస్తామని బిడెన్ హామీ ఇచ్చారు.

అనవసరంగా సవాల్ చేశామా ? రుణమాఫీ పై బీఆర్ఎస్ టెన్షన్