వాటిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు..!!

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.

రమణ రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవలే కొద్ది రోజుల క్రితం సొంత జిల్లా కృష్ణా జిల్లాలో పర్యటించిన ఎన్.

వి.రమణ కి ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఘన స్వాగతం పలకడం మాత్రమేకాక తేనేటి విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

అనంతరం తాజాగా హైదరాబాదు బుక్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్.వి.

రమణ పుస్తకం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడారు.తాను చదువుకుంటున్న టైంలో పాఠశాలల్లో ఖచ్చితంగా ప్లేగ్రౌండ్ మరియు గ్రంథాలయం ఉండేది అని తెలిపారు.

"""/" / అవి నేను జీవితంలో పైకి రావటానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి అని స్పష్టం చేశారు.

దాదాపు మూడు గంటల పాటు గ్రంథాలయంలో గడిపేవాడిని.న్యూస్ పేపర్ తో పాటు.

అందుబాటులో ఉండే పుస్తకాలను చదివే వాడిని అని ఎన్.వి.

రమణ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం పెద్ద పెద్ద భవనాలలో స్కూల్స్ మరియు కాలేజీలు  కనబడుతున్న కానీ వాటిల్లో గ్రంధాలయాలు మరియు ప్లేగ్రౌండ్ కనబడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యాసంస్థలు నిబంధనలు పాటించడం లేదని ప్రభుత్వాలు వీటిపై దృష్టి సారించాలని ఎన్.వి.

రమణ కోరారు.జీవితంలో పిల్లలు పైకి రావాలని కోరుకునే తల్లిదండ్రులు ఖచ్చితంగా డిజిటల్ రీడింగ్ కి ప్రాధాన్యత ఇవ్వకుండా పుస్తక పఠనంతో పాటు వ్యాయామం వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చి పిల్లలను పైకి తీసుకురావాలని ఎన్.

వి.రమణ సూచించారు.

పుస్తక పఠనం, వ్యాయామం విద్యార్థి దశలో చాలా కీలకమని చెప్పుకొచ్చారు.ప్రభుత్వాలు కూడా వీటిపై దృష్టి సారించాలని అన్నారు.

తమిళ్ ఇండస్ట్రీ ని పాన్ ఇండియాలో నిలిపే సత్తా ఆ స్టార్ హీరోకే ఉందా..?