ఓటుకు నోటు కేసుపై సుప్రీంలో విచారణ వాయిదా

ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో( Supreme Court ) విచారణ వాయిదా పడింది.

ఈ మేరకు కేసులో తగిన సమాచారం ఇచ్చేందుకు సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది అత్యున్నత న్యాయస్థానంను కోరారు.

ఈ క్రమంలోనే సెలవుల తరువాత విచారణ జరపాలని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా( Siddharth Luthra ) సుప్రీంకోర్టును కోరారు.

ఓటుకు నోటు వ్యవహారం 2015 లో జరిగిందని, ఏళ్ల తరబడి కేసు పెండింగ్ లో ఉందని పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఓటుకు నోటుపై సీబీఐ విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ లో పేర్కొన్నారు.

వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జూలై 24వ తేదీకి వాయిదా వేసింది.

ఏడు సినిమాలు ఫ్లాప్..లక్ష్మి నరసింహ నుంచి సింహ వరకు ఏం జరిగింది ?