అతని ప్రేమకు నేను ఓకే చెప్పాను.. సుప్రీత ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!

సురేఖవాణి కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో పాటు ఆమె చేసిన పోస్టులు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుప్రీత నెటిజన్ల కామెంట్ల గురించి తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు.

గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సుప్రీత అంతకంతకూ పెంచుకుంటూ ఉండటం గమనార్హం.

కొన్ని సందర్భాల్లో సుప్రీత ఫోటోలు ట్రోల్ కాగా మరికొన్ని సందర్భాల్లో సురేఖవాణి సుప్రీత అక్కాచెల్లెళ్లలా ఉన్నారని కామెంట్లు వినిపించాయి.

అయితే తాజాగా సుప్రీత తన లైఫ్ పార్ట్ నర్ ను అభిమానులకు పరిచయం చేశారు.

ఒక వ్యక్తితో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సుప్రీత ఆ వ్యక్తి లవ్ కు తాను ఓకే చెప్పానని చెప్పుకొచ్చారు.

అయితే సుప్రీత నిజంగానే అతన్ని ప్రేమిస్తుందా? లేక ఏదైనా వెబ్ సిరీస్, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలా చెబుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

"""/"/ సుప్రీత తను ప్రేమలో ఉన్నానని చెప్పిన వ్యక్తి పేరు రాకీ జోర్డాన్ అని సమాచారం.

రాకీ జోర్డాన్ నటుడు కావడంతో పాటు ర్యాపర్ అని తెలుస్తోంది.వీళ్లిద్దరూ నిజంగా ప్రేమికులైతే వీళ్ల ప్రేమ విషయంలో సురేఖ వాణి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

రెండు రోజుల క్రితం నందు అనే అబ్బాయి స్నేహితుడు అని చెప్పిన సుప్రీత ప్రస్తుతం ఆమె బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేయడం గమనార్హం.

ప్రతి అమ్మాయికి అలాంటి ఫ్రెండ్ ఒకడు ఉండాలని అమ్మాయి అబ్బాయి స్నేహితులుగా ఉండలేరని అందరూ అనుకున్నా మేం ఫ్రెండ్స్ లా ఉన్నామని ఎప్పటికీ మేం బెస్ట్ ఫ్రెండ్స్ అని రెండు రోజుల క్రితం నందు అనే అబ్బాయి గురించి పోస్ట్ పెట్టిన సుప్రీత తాజాగా తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చారనే చెప్పాలి.

164 అడుగుల లోయలో పడిపోయిన ప్రెగ్నెంట్ టీచర్… చివరికేమైందో తెలిస్తే?