నల్లగొండ జిల్లా:రైతులు ప్రభుత్వం ఎర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యం విక్రయించుకొని మద్దతు ధర పొందాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు.
ఆదివారం నకిరేకల్,కట్టంగూర్,అయిటిపాముల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రబీ సీజన్లో ధాన్యం బాధ్యత యుతంగా కొనుగోలు చేయాలనే దృక్పథంతో ఐకేపి కేంద్రాలను ప్రారంభించామన్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయమని చెప్పి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని,కొనుగోలు చేయాలని వివిధ పద్దతుల్లో తెలంగాణ ప్రభుత్వం నిరసనలు వ్యక్తం చేశామని చివరకు ఢిల్లీలో దీక్షలు చేసినా చలనం లేదని అన్నారు.
అనంతరం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతులకు స్వీట్లు పంపిణీ చేశారు.
సుంకాల యుద్ధం.. డొనాల్డ్ ట్రంప్‌ను ఢీకొడుతోన్న కెనడా నేత