పూడిక తీత పనుల పర్యవేక్షణ.. పూడిక తీత పనుల కమిటీ చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కు సింగ సముద్రం నుండి వచ్చే కనెక్టింగ్ కాలువల పూడిక తీత పనులు ప్రారంభం అయ్యాయి.

మంగళవారం దుబ్బ కాలువ పనులు ఉపాధి కూలీలతో పనులు జరుగుతుండగా పనులను పూడిక తీత పనుల కమిటీ చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్( Balaraj Yadav ) పర్యవేక్షణ చేశారు.

ఉపాధి పని చేస్తున్న కూలీలకు డబ్బులు తొందరగా ప్రభుత్వం ద్వారా చెల్లింపు జరిగేలా చూస్తానని కూలీలతో బాలరాజు యాదవ్ అన్నారు.

గ్రామంలో గల ఉపాధి హామీ కూలీల సంఖ్య వివరాలను ఫీల్డ్ అసిస్టెంట్ కోనేటి నరేష్ ను అడిగి తెలుసుకున్నారు.

గ్రామంలో గల అన్ని సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల పూడికతీత అతి తొందరగా పూర్తి చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ కోనేటి నరేష్ తో మాట్లాడారు.

ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట యూత్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అద్యక్షులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్ ఉన్నారు.

50 డేస్ సెంటర్ల విషయంలో పుష్ప ది రూల్ గ్రేట్ రికార్డ్.. అన్ని స్క్రీన్స్ లో రన్ అవుతోందా?