సూపర్‌ స్టార్‌జీ ఈ వయసులో అంత సాహసం అవసరమా?

రజినీకాంత్‌ హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో మూవీ దాదాపుగా ఫైనల్‌ అయ్యింది.'పేట' చిత్రంతో సక్సెస్‌ జోష్‌లో ఉన్న రజినీకాంత్‌ మరియు సర్కార్‌ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్న దర్శకుడు మురుగదాస్‌ల కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కబోతుంది.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది.

ఇటీవలే ఈ చిత్రంలో హీరోయిన్‌ గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లుగా కూడా అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఇదే సమయంలో ఈ చిత్రంలో రజినీకాంత్‌ పోలీస్‌ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఏడు పదుల వయసు అంటే పోలీసులు రిటైర్‌మెంట్‌ తీసుకునే వయసు.

కాని రజినీకాంత్‌ ఈ వయసులో పోలీసు పాత్ర చేసి యాక్షన్‌ సీన్స్‌లో నటించి ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

దాదాపు 30 ఏళ్ల క్రితం రజినీకాంత్‌ పోలీసు పాత్రలో నటించాడు.అంతుకు ముందు కూడా పలు చిత్రాల్లో పోలీస్‌గా కనిపించాడు.

కాని ఈ ముప్పయి ఏళ్ల కాలంలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా పోలీసుగా కనిపించలేదు.

మళ్లీ ఇన్నాళ్లకు రజినీకాంత్‌ను మురుగదాస్‌ పోలీస్‌గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ను ఎలా చూపించినా ఆయన అభిమానులు కిందా మీదా పడి మరీ చూస్తారు.

ఆయనకున్న క్రేజ్‌ అలాంటిది.ఇక పోలీస్‌ పాత్రలో అయితే చెప్పే అవకాశమే లేకుండా ఉంటుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ మూడు దశాబ్దాల తర్వాత రజినీకాంత్‌ పోలీస్‌ యూనిఫార్మ్‌ వేసుకుంటున్న నేపథ్యంలో ఇక రచ్చ రచ్చగా అభిమానులు పండుగ చేసుకోవచ్చు అంటూ తమిళ సినీ వర్గాల వారు అంటున్నారు.

అయితే కొందరు మాత్రం ఏడు పదుల వయసులో పోలీస్‌ పాత్రకు రజినీకాంత్‌ ఏం సెట్‌ అవుతాడంటూ పెదవి విరుస్తున్నారు.

మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలంటే ఈ ఏడాది చివరి వరకు ఆగలి.

ఎందుకంటే ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేస్తామంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

వరద నీరు పొంగుకొచ్చినా చెక్కుచెదరని ఆలయం… నీటిని దరి చేరనివ్వని ఆలయ కోనేరు!