ఓకే వేదికపై రజిని, ధనుష్ లకు అవార్డులు..!
TeluguStop.com
సూపర్ స్టార్ రజినికాంత్, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మామా అల్లుళ్లన్న విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ మామా అల్లుళ్లు ఒకే వేదిక మీద ప్రతిష్టాత్మక అవార్డులను అందుకోనున్నారు.
రీసెంట్ గా రజినీకి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ అవార్డు ప్రధానోత్సవంలోనే జాతీయ అవార్డులను ఇవ్వనున్నారట.ఈమధ్యనే నేషనల్ అవార్డ్ ప్రకటనల్లో అసురన్ సినిమాకు గాను ధనుష్ ఉత్తమ నటుడిగా అవార్డ్ గెలుచుకున్నారు.
మే 3న 67వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది.అయితే ఇదే వేదిక మీద రజినీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరిస్తారని తెలుస్తుంది.
ఒకే వేదిక మీద అటు రజినీ, ఇటు ధనుష్ ఇద్దరు ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకోవడం రజినీ ఫ్యామిలీకి మరిచిపోలేని జ్ఞాపకంగా నిలుస్తుంది.
వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ రజినీ వరుసగా సినిమాలు చేస్తున్నారు.ధనుష్ కూడా మామకు తగిన అల్లుడిగా తన సత్తా చాటుతున్నాడు.
రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమా చేస్తుండగా.ధనుష్ కర్ణన్, జగమే తందిరం సినిమాల్లో నటిస్తున్నారు.
2010లో ఆడుకాలం సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న ధనుష్ అసురన్ సినిమాతో రెండోసారి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు.
నన్ను వెంటాడే ఎమోషన్ నువ్వు… ఆసక్తికర పోస్ట్ చేసిన ఎన్టీఆర్!