మే 7న హైదరాబాద్‌ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్- ట్విట్టర్ లో ట్రెండ్ సెట్ చేసిన సర్కారు వారి పాట ఎమోజి

మే 7న హైదరాబాద్‌ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్- ట్విట్టర్ లో ట్రెండ్ సెట్ చేసిన సర్కారు వారి పాట ఎమోజి

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

మే 7న హైదరాబాద్‌ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్- ట్విట్టర్ లో ట్రెండ్ సెట్ చేసిన సర్కారు వారి పాట ఎమోజి

మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.

మే 7న హైదరాబాద్‌ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్- ట్విట్టర్ లో ట్రెండ్ సెట్ చేసిన సర్కారు వారి పాట ఎమోజి

రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అంచనాలని మరో స్థాయికి తీసుకెళ్లింది సర్కారు వారి పాట థియేట్రికల్ ట్రైలర్.

అభిమానులలతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులని అలరించిన సర్కారు వారి పాట ట్రైలర్.

సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా ? అనే ఆసక్తిని డబల్ చేసింది.ప్రస్తుతం ప్రమోషన్స్ లో దూసుకెళ్తున్న సర్కారు వారి పాట టీం నుండి మరో అదిరిపోయే ప్రకటన వచ్చింది.

సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లేస్, డేటుని ఖరారు చేసింది చిత్ర యూనిట్.

మే 7న హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో 'సర్కారు వారి పాట' గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభమవుతుంది.

ఫ్యాన్స్ భారీగా వచ్చి ఈవెంట్ ని ప్రత్యేక్షంగా ఎంజాయ్ చేసే విధంగా చిత్ర యూనిట్ ఓపెన్ గ్రౌండ్‌ను ఎంచుకుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంటున్న ఈ ఈవెంట్ లో ప్రేక్షకులకు చాలా సర్ప్రైజ్ లు వుండబోతున్నాయి.

ఇదిలా వుంటే ఇప్పటికే ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజులు ఇచ్చిన సర్కారు వారి పాట టీం.

ఇప్పుడు మరో గ్రేట్ సర్ ప్రైజ్ ఇచ్చింది.నిన్న అభిమానుల కోసం ఒక సర్ప్రైజ్‌ ను వెల్లడిస్తానని ప్రకటించి చిత్ర యూనిట్, చెప్పినట్లే 'సర్కారు వారి సూపర్ సర్ప్రైజ్' అందించింది.

సర్కారు వారి పాట ట్విట్టర్ ఎమోజీతో అభిమానులని సర్ ప్రైజ్ చేసింది.ట్విట్టర్ లో ఒక రీజినల్ మూవీ ప్రత్యేకమైన ఎమోజీని కలిగి ఉండటం ఇదే తొలిసారి.

ఇంతకుముందు, కెజిఎఫ్ 2, సాహో వంటి పాన్ ఇండియన్, మల్టీ లాంగ్వేజ్ చిత్రాలకు మాత్రమే ఎమోజి ఉండేది.

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్, సర్కారు వారి పాట సినిమాపై వున్న భారీ హైప్ నేపధ్యంలో ట్విట్టర్ టీమ్ ఎమోజిని యాక్టివేట్ చేసింది.

సినిమా టైటిల్ హ్యాష్‌ట్యాగ్‌ లతో సర్కారు వారి ఎమోజి ని వాడటం ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులని అలరిస్తుంది.

ఇప్పటికే 'సర్కారు వారి పాట' సాంగ్స్ , ట్రైలర్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాయి.

ఇప్పుడు ఈ ట్విట్టర్ ఎమోజీ టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ ను సెట్ చేసింది సర్కారు వారి పాట.

బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో,.మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది.

ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఆర్ మధి సినిమాటోగ్రాఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 12 విడుదలకు సిద్దమౌతుంది.

H3 Class=subheader-styleతారాగణం:/h3p మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు.

H3 Class=subheader-style సాంకేతిక విభాగం:/h3p రచన, దర్శకత్వం: పరశురాం పెట్ల, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.

రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట బ్యానర్లు: మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్, సంగీతం: ఎస్ఎస్ థమన్, సినిమాటోగ్రఫీ: ఆర్ మధి ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్,ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్,ఫైట్స్: రామ్ - లక్ష్మణ్,లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో-డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, సీఈవో: చెర్రీ, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ - యుగంధర్,పీఆర్వో : వంశీ- శేఖర్.

భయ్యా అది బస్సు కాదు.. ఆటో! పిల్లల ప్రాణాలతో చెలగాటమా?