మరో బ్రాండ్ కి అంబాసిడర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈయన ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరి కొన్ని వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.

ఇలా ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

తాజాగా కూల్ డ్రింక్ ప్రోడక్ట్ మౌంటెన్ డ్యూకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలోనే భయాలను పక్కన పెట్టి, సవాళ్లను అధిగమించి రిస్క్ తీసుకుంటేనే పేరు వస్తుంది అనే ట్యాగ్ లైన్ యూత్ ను అట్రాక్ట్ చేసే విధంగా యాడ్ కొనసాగుతుంది.

ఇక కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఇండియా లెవెల్ లో మహేష్ బాబుకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మౌంటెన్ డ్యూ నిర్వాహకులు వారి ప్రాడేక్ట్ కి మహేష్ బాబు ప్రచారకర్తగా వ్యవహరిస్తే తమ ప్రాజెక్ట్ మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

"""/" / ఇక మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండటం కాకుండా ఇలా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.

ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే.పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రంలో మహేష్ బాబు నటిస్తున్నారు.

ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ పాత్రలో సందడి చేయనుంది.ఈ సినిమా వేసవి సెలవులకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి23, గురువారం 2025