సూపర్‎స్టార్ కృష్ణకు స్వల్ప అస్వస్థత..!

ప్రముఖ సినీ నటుడు, సూపర్‎స్టార్ కృష్ణ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.శ్వాస సంబంధిత సమస్యతో ఆయన బాధపడ్డారు.

దీంతో ముందుజాగ్రత్తగా కృష్ణను ఆయన కుటుంబ సభ్యులు రాత్రి నానక్ రామ్ గూడలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు.

అయితే కృష్ణ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ అవుతారని కుటుంబ సభ్యులు తెలిపారు.

అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అదేవిధంగా ఆస్పత్రి వద్దకు రావొద్దని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

ఫుట్‌పాత్‌పై మహీంద్రా థార్‌తో దూసుకెళ్లిన బాలుడు.. వీడియో చూస్తే..