జీవకళ ఉట్టిపడేలా సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం.. నేడు హైదరాబాద్‌కు తరలింపు

ఇటీవల కన్నుమూసిన 340 సినిమాలకు పైగా నటించిన సినీనటుడు కృష్ణ కు ఘనంగా నివాళులు అర్పించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆయన రూపాన్ని నిత్యం స్మరించుకునేలా విగ్రహాన్ని తయారుచేస్తున్నారు.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండల కేంద్రంలో ఈ విగ్రహాన్ని తయారు చేయించారు.

స్థానిక శిల్పి వడయార్‌కు కృష్ణ కుటుంబసభ్యులు కోరిక మేరకు అభిమానుల కోరిక మేరకు 27 సంవత్సరాల వయసులో కృష్ణ ఎలా ఉంటారో అదే విధంగా వడయార్ ఆరు రోజులు శ్రమించి ఫైబర్‌తో జీవకళ ఉట్టిపడేలా విగ్రహాన్ని తయారుచేశారు.

సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహాన్ని రేపు 27 వ తారీకున N కన్వెన్షన్ హాల్లో జరగనున్న దశదిన కర్మకు నేడు హైదరాబాద్‌కు పంపుతున్నట్లు శిల్పి వడయార్ తెలిపారు.

అల్లు అర్జున్ కంటే గొప్పగా ఎవరూ నటించలేరు.. పూనమ్ కౌర్ ఆసక్తికర పోస్ట్ వైరల్!