చిట్లిన జుట్టును రిపేర్ చేసే సూపర్ టిప్స్ మీకోసం!
TeluguStop.com
జుట్టు చివర్లు చిట్లడం అనేది చాలా మంది ఫేస్ చేసే సమస్య.జుట్టుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ( Vitamins , Minerals )అందకపోవడం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వినియోగించడం, కలర్స్, డైయింగ్ వంటి కెమికల్స్ ను వాడటం, సన్ ఎక్స్‌పోజర్, పలు ఆరోగ్య సమస్యలు, రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేసుకోవడం తదితర అంశాలు జుట్టు స్ట్రక్చర్‌ను దెబ్బతీసి, చిట్లిపోవడాన్ని కారణం అవుతాయి.
అయితే చిట్లిన జుట్టును రిపేర్ చేసే సూపర్ టిప్స్ కొన్ని ఉన్నాయి.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నూనె( Coconut Oil ) మరియు తేనె కాంబినేషన్ చిట్లిన జుట్టును రిపేర్ చేయడానికి మంచిగా ఉపయోగపడుతుంది.
మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో రెండు టేబుల్ స్పూన్లు తేనె( Honey ) కలిపి బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి.40 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూను తలస్నానం చేయాలి.
వారానికి ఒకసారి ఇలా చేస్తే చిట్లిన జుట్టు మృదువగా, ఆరోగ్యంగా మారుతుంది. """/" /
చిట్లిన జుట్టుకు పెరుగునుయూజ్ చేయవచ్చు.
పెరుగులోని న్యూట్రీయెంట్స్ జుట్టు ఆరోగ్యాన్ని పోషిస్తాయి.అర కప్పు పెరుగులో రెండు టేబుల్ స్పూన్ల ఆవనూనె( Mustard Oil ) కలిపి జుట్టుకు అప్లై చేయండి.
ముప్పై నిమిషాల అనంతరం హెయిర్ వాష్ చేసుకోండి.ఇలా చేయడం వల్ల చిట్లిన జుట్టు రిపేర్ అవుతుంది.
హెయిర్ ఫాల్ తగ్గుముఖం పడుతుంది.చుండ్రు సమస్య( Dandruff ) ఉన్న కూడా దూరం అవుతుంది.
"""/" /
అవకాడోతో కూడా చిట్లిన జుట్టును ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.అవకాడో పల్ప్ ( Avocado Pulp )ను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో నాలుగు టేబుల్ స్పూన్లు కొబ్బరి పాలు కలిపి జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.అవకాడో మరియు కొబ్బరి పాలల్లో ఉన్న ఫ్యాటీ యాసిడ్లు హెయిర్ ను హెల్తీ, స్ట్రోంగ్ గా మారుస్తాయి.
చిట్లిన జుట్టును మృదువుగా మారుస్తాయి.
గోపీచంద్ మలినేని జాట్ తెలుగు వెర్షన్ ఆలస్యం కానుందా.. అసలు కారణాలు ఇవేనా?