ప్రెగ్నెన్సీ టైమ్‌లో కాళ్ల వాపుల‌ను త‌గ్గించే సూప‌ర్ టిప్స్ ఇవే!

గ‌ర్భం దాల్చ‌డం అనేది ప్ర‌తి మ‌హిళ ఒక వ‌రంలా భావిస్తుంది.ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో త‌మ క‌డుపులోని బిడ్డ కోసం ఎంతో కేర్ తీసుకుంటారు.

ప్ర‌తి విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారు.ఇక ఈ సమయంలో ఎన్ని సమస్యలు ఎదురైనా ఎంతో ఆనందంగా ఎదుర్కుంటారు.

అయితే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో చాలా కామ‌న్‌గా ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల్లో కాళ్లు వాపులు ముందుంటుంది.

కొంద‌రికీ ఈ స‌మ‌స్య‌లు మూడో నెల నుంచి స్టాట్‌ అయితే.కొంద‌రికి ఏడో లేదా ఎనిమిదో నెల నుంచి స్టాట్ అవుతుంది.

శరీరంలో ఎక్కువ నీరు నిల్వ ఉండడం వ‌ల్ల ఇలా జ‌రుగుతుంటుంది.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే.

కాళ్ల వాపుల స‌మ‌స్య‌ నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.కాళ్లు వాపు ఉన్న‌ప్పుడు గ‌ర్భ‌ణీ స్త్రీలు ప్ర‌ధానంగా చేయాల్సిన ప‌ని వాకింగ్‌.

ఎప్పుడు రెస్ట్ మోడ్‌లోనే ఉండ‌డం వ‌ల్ల కాళ్లు వాపులు వ‌స్తుంటాయి.అందుకే ప్ర‌తి రోజు కాసేపు వాకింగ్ చేస్తూ ఉంటే మంచిద‌ని అంటున్నారు.

అలాగే ఎక్కువ సమయం నిల్చోవడం కానీ లేదా ఎక్కువ స‌మ‌యం కూర్చోవడం కానీ చేయకూడదు.

ఈ రెండు బ్యాలెన్స్‌గా ఉన్న‌ప్పుడే కాళ్ల వాపులు త‌గ్గుతాయి.పోష‌కాలు నిండి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

అదే స‌మ‌యంలో ఉప్పు, చ‌క్కెర త‌గ్గుంచుకోవాలి.త‌ద్వారా కాళ్ల వాపుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

ఇక ప్రెగ్నెన్సీ టైమ్‌లో టైట్ ప్యాంట్స్‌, టైట్ గా ఉండే సాక్సులు ధ‌రించ‌కూడ‌దు.

ఎందుకంటే, వీటి వ‌ల్ల కాళ్ళకు రక్తప్రసరణ సంక్ర‌మంగా జ‌ర‌గ‌దు.త‌ద్వారా వాపులు వ‌స్తుంటాయి.

ఇక ప్ర‌తి రోజు ప్రెగ్నెన్సీ మ‌హిళ‌లు నీరు ఎక్కువ‌గా తీసుకోవాలి.నీరు ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల శరీరంలో ఉండే వ్యర్థా పదార్దాలు బయటకు పోయి.

కాళ్ల వాపులు త‌గ్గుతాయి.మ‌రియు రాకుండా ఉంటాయి.

అలాగే కాళ్లు వాపులు వ‌చ్చిన‌ప్పుడు కాస్త వేడి పెట్ట‌డం వ‌ల్ల మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌ని అంటున్నారు.

కడుపు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. చిటికెలో తగ్గించే చిట్కాలు ఇవి!