మహేష్ గొప్పదనానికి నిదర్శనం ఇదే.. అర్హ విషయంలో అలా చేయడంతో?
TeluguStop.com
సూపర్ స్టార్ మహేష్ బాబు తాను స్టార్ హీరో అయినా ఇతర భాషల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్నా వీలైనంత వరకు సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు.
సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీని సైతం పట్టించుకోకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు.
ఊహించని స్థాయిలో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న మహేష్ సినిమా సినిమాకు ఆ ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటూ ఇతర హీరోలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
తాజాగా గుణ శేఖర్ కూతురు నీలిమ గుణ, బిజినెస్ మేన్ రవిల రిసెప్షన్ వేడుక అంగ రంగ వైభవంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు బన్నీ, మహేష్ హాజరయ్యారు.తారక్ కూడా గుణశేఖర్ కు సన్నిహితుడే అయినా తారక్ ప్రస్తుతం విదేశాల్లో ఉండటంతో ఈ వివాహానికి హాజరు కాలేకపోయారని సమాచారం అందుతోంది.
అయితే ఈ వేడుకలో మహేష్ బాబు అర్హతో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.బన్నీ కూతురితో మహేష్ మాట్లాడి తన యోగక్షేమాల గురించి మహేష్ కనుక్కోవడంతో పాటు ఆప్యాయంగా మాట్లాడారు.
మహేష్ చాలా గ్రేట్ అని తన విలువైన సమయంలో కొంత సమయాన్ని అర్హ కోసం కేటాయించి మహేష్ తాను గ్రేట్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు.
తండ్రి చనిపోయిన బాధ నుంచి కోలుకుంటున్న్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్ లపై దృష్టి పెడుతున్నారు.
"""/"/
మహేష్ త్వరలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో బిజీ కానున్నారు.
పూజా హెగ్డే, శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా 2023 ఆగష్టు టార్గెట్ గా ఈ మూవీ షూట్ జరుగుతోంది.
వీలైనంత వేగంగా ఈ సినిమా షూటింగ్ జరిగేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం దెబ్బకు ఆగుతుంది!