సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదా.. మంచి హీరో అంటూ?

ఒక సినిమా సక్సెస్ సాధించినా ఫెయిల్యూర్ అయినా ఆ ప్రభావం ప్రధానంగా హీరో, దర్శకుడు, నిర్మాతపై పడుతుంది.

వరుసగా సినిమాలు ఫ్లాపైతే నిర్మాతల కెరీర్ ప్రమాదంలో పడుతుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సినిమాలలో టక్కరి దొంగ సినిమా( Takkari Donga ) కూడా ఒకటి.

ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.ఈ సినిమాకు దర్శకుడు నిర్మాత ఒక్కరే కావడం గమనార్హం.

జయంత్.సి.

పరాన్జీ ఈ సినిమాకు దర్శకనిర్మాతగా వ్యవహరించారు.ఈ సినిమా ఫ్లాపైన తర్వాత రెమ్యునరేషన్ తీసుకోవాలని జయంత్ మహేష్ బాబుకు సూచిస్తే మహేష్ బాబు మాత్రం సినిమా ఫ్లాపై ఇప్పటికే నష్టాలు వచ్చాయని రెమ్యునరేషన్ ఎందుకని చెప్పినట్టు తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి హీరో అని ఆయనను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

"""/" / ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడం ద్వారా మహేష్ బాబు చాలా సందర్భాల్లో మంచి మనస్సును చాటుకున్నారు.

మహేష్ బాబు వల్ల ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు నిలబడ్డాయి.మహేష్ బా( Mahesh Babu )బు ఇప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఎంతోమందిలో వెలుగు నింపుతున్నారు.

తమ వంతుగా కొంతమంది విద్యార్థులను సైతం మహేష్ ఫ్యామిలీ చదివిస్తోంది. """/" / మహేష్ బాబు తర్వాత సినిమా జక్కన్న డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాతో మహేష్ బాబు ఇంటర్నేషనల్ స్టార్ అవుతారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మహేష్ బాబు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవడంతో పాటు తన మార్కెట్ ఇంటర్నేషనల్ స్థాయిలో పెరిగే విధంగా జాగ్రత్త పడుతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ కావడంతో పాటు పాన్ వరల్డ్ స్థాయిలో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కొత్త టాలెంట్ చూపించి ఆశ్చర్యపరిచిన యాక్టర్స్.. వాళ్లెవరంటే..?