సెట్స్ లో అల్లు రామలింగయ్యను సూపర్ స్టార్ కృష్ణ‌ ఎలా ఏడిపించారో చూడండి

అల్లు రామలింగయ్య.కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా పరిశ్రమలో కామెడియన్ గా రాణించాడు.

తన చక్కటి నటనతో మంచి జనాదరణ పొందాడు.తన మాటలు, తన ఆహార్యంతో అదరగొట్టేవాడు.

సినిమాల్లోనే కాదు.బయటకూడా ఆయన చాలా సరదాగా ఉండేవాడు.

తోటి నటీనటులతో జోకులు వేస్తూ కలివిడిగా ఉండేవాడు.ఒకసారి మద్రాసు వాహిని స్టూడియోస్ లో ప‌గ‌బ‌ట్టిన సింహం సినిమా షూటింగ్ జరుగుతుంది.

ఇందులో హీరోగా కృష్ణ‌ నటించాడు.ఈ సందర్భంగా అల్లు రామలింగయ్యకు, కృష్ణ‌కు మధ్య ఆసక్తికర సన్నివేశం జరిగింది.

సెట్స్ లో నవ్వుల పువ్వులు పూశాయి.ఇంతకీ వీరిద్దరి మధ్యన జరిగిన సరదా సన్నివేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సినిమాలోని చంద‌మామ‌తో బిళ్లంగోడు ఆడిన‌ట్లు దిక్కుల‌న్నీ అదిరిప‌డ్డ‌వి అనే పాట చిత్రీకరణ జరుగుతుంది.

కృష్ణ‌, జ‌య‌ప్ర‌ద‌, గీత‌, జ్యోతిల‌క్ష్మి ఎలా డ్యాన్స్ చేయాలి అనే విషయాన్ని కొరియోగ్రాఫర్ శ్రీను వివరిస్తున్నాడు.

ఈ సందర్భంగా అక్కడికి మంచి లాల్చీ వేసుకుని.భుజం మీద కండువాతో వచ్చాడు అల్లు రామలింగయ్య.

అతడిని చూసి కృష్ణ‌.ఏంటీ ప్రేమాభిషేకం గెట‌ప్‌ లో పాపారాయుడిలా వస్తున్నావన్నాడు.

హీరో కావాలనుకుంటున్నావా? రామారావు, నాగేశ్వరరావకు చెప్తాను ఉండండి అంటూ ఆటపట్టించాడు.అయ్యా మీరు హీరోలు, మేం కమెడియన్లం.

సినిమాల్లో ఎలాగూ ఏడిపిస్తారు.ఇక్కడ కూడా ఏడిపిస్తారా అంటూ మందు తాగిన వాడిలా నటిస్తూ మాట్లాడాడు అల్లు రామలింగయ్య.

"""/"/ ఈ మాటలు విన్న దర్శకుడు చంద్రశేఖర్ రెడ్డి.రామలింగయ్య గారు.

మీ షాట్ ఇంకా అరగంట తర్వాత ఉందండి.ఇప్పడే తాగుబోతు మూడ్ లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పాడు.

ఏంటీ ఈయ‌న తాగుబోతుగా నటిస్తూ పాటపాడుతాడా? అంటూ కృష్ణ‌ నవ్వాడు.ఈ సినిమాలో ఆయనకు అమ్మాయిలంటే మోజు.

కనిపించిన ప్రతి అమ్మాయి వెంట పడతాడు.అందులో భాగంగానే ఈ పాట అని దర్శకుడు చెప్తాడు.

మొత్తానికి ఈ సినిమాలో అల్లుగారూ పాట పాడ‌తార‌న్న మాట అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.

అందుకే అలా ఫోజు కొడుతూ సెట్ లోకి వచ్చాడు అన్నాడు కృష్ణ‌.అయ్యా.

అనవసరంగా ఈ గెటప్ లో మీ కంటపడ్డాను అనడంతో సెట్లో ఉన్న వాళ్లంతా నవ్వారు.

కృష్ణ మూడు క్యారెక్టర్లు చేసిన ఈ సినిమాలో జ‌య‌ప్ర‌ద‌, గీత, ప్ర‌భ‌ హీరోయిన్లుగా నటించారు.

1982 సెప్టెంబ‌ర్ 3న ఈ మూవీ రిలీజ్ అయ్యింది.మంచి విజయం సాధించింది.

సంక్రాంతికి వస్తున్నాం మమ్మల్ని బావి నుంచి బయటపడేసింది.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు!